దారుణం.. కోడలి తలనరికి హతమార్చిన అత్తమామలు, బావమరుదులు!

భూ వివాదం తండ్రి-కొడుకులు, కుటుంబ సభ్యుల నడుమ చిచ్చు రేపి చివరకు ఓ మహిళ దారుణ హత్యకు దారితీసిన దారుణ ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 1.5 ఎకరాల పొలం వివాదంలో 28 ఏళ్ల కోడలిని అత్తమామలు, బావమరుదులు అత్యంత దారుణంగా వేటకత్తితో తల నరికి హత్య చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌కొండ మండలం చింతల్ తండాలో నవంబర్ 2న చోటుచేసుకుంది.

ఓటీటీని షేక్ ఆడిస్తున్న క్రైం థ్రిల్లర్ సిరీస్.. అన్నీ తల లేని శవాలే!
ఓటీటీని షేక్ ఆడిస్తున్న క్రైం థ్రిల్లర్ సిరీస్.. అన్నీ తల లేని శవాలే!

బట్టతో మెడను బిగించి.. ఇంట్లోకి లాక్కెళ్లి దారుణం
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలికి 12 ఏళ్ల క్రితం బంధువుల అబ్బాయితో వివాహమైంది. వీరికి ఇద్దరి పిల్లలు ఉన్నారు. అయితే భర్త మానసిక సమస్యల కారణంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గడిచిన ఏడాది కాలంగా భర్త హైదరాబాద్‌లో నివాసముంటుండగా.. సదరు మహిళ చింతల్ తండాలోని వేరొక ఇంట్లో నివసిస్తోంది.

Mahabubnagar Shocker Woman Beheaded by In-Laws Over 1 5-Acre Land Dispute Police register case

ఈ క్రమంలో భర్త పేరిట ఉన్న 1.5 ఎకరాల భూమిని ఆమె తన పేరుమీదికి మార్పుంచుకుంది. ఈ విషయమై మామ, ఇతర కుటుంబ సభ్యులు ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నవంబర్ 2న ఈ భూవివాదంపై సదరు మహిళకు మామ, వారి కుటుంబ సభ్యులకు మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన నిందితులు ఆమె మెడకు గుడ్డ బిగించి, ఈడ్చుకెళ్తూ తమ ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంతరం వేటకత్తితో దాడి చేసి దారుణంగా తలనరికి చంపేశారు. ఘటన జరిగిన సమయంలో బాధితురాలి భర్త హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. నేపాలీ ముఠా అరెస్ట్..
హైదరాబాద్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. నేపాలీ ముఠా అరెస్ట్..

ఐదుగురిపై కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం
తన కూతురిని ఆస్తి వివాదం కారణంగానే మామ, బావమరుదులు కలిసి దారుణంగా హత్య చేశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం నిందితులు పరారవడంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు కోయిల్‌కొండ పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+