చర్లపల్లి నుంచి వెళ్లాల్సిన ఈ రైళ్లు రద్దు..!!
Charlapalli Railway Station: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా 2025 వైభవంగా కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. భక్తులతో కిటకిటలాడుతోంది. కోట్లాదిమంది గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు.
పుణ్యస్నానాలను ఆచరించిన వారి సంఖ్య 53 కోట్లకు చేరింది. కిందటి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ అతిపెద్ద ఆధ్యాత్మికోత్సవం. దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. త్రివేణి సంగమం ఘాట్లన్నీ కూడా పోటెత్తాయి.

భక్తల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్‌రాజ్, త్రివేణి సంగమం ఘాట్లన్నింటినీ నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింట్లో వాహనాల రాకపోకలను నిషేధించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కూడా నగరం బయటే నిలిపివేయాల్సి ఉంటుంది. త్రివేణి సంగమం నోస్ పాయింట్‌తో పాటు ఇతర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
మహా కుంభ మేళాలో అమృత్ స్నానాన్ని ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మకర సంక్రాంతి తొలి అమృత్ స్నాన పర్వదినం. దీని తరువాత మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమ, మహా శివరాత్రి.. ఈ నాలుగు పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధవులు చెబుతున్నారు.
మహా కుంభమేళా కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్ మీదుగా దానాపూర్, అలీగఢ్.. వంటి స్టేషన్లకు ఆయా రైళ్లన్నీ రాకపోకలు సాగిస్తోన్నాయి.
కాగా- చర్లపల్లి నుంచి దానాపూర్ మధ్య గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లు తాజాగా రద్దయ్యాయి. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఆపరేషనల్ కారణాలతో వాటిని రద్దు చేసినట్లు వివరించారు. ఈ మేరకు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
చర్లపల్లి నుంచి దానాపూర్‌కు నేడు బయలుదేరి వెళ్లాల్సిన 07791, 07792 ప్రత్యేక రైళ్లు రద్దయ్యాయి. అలాగే ఈ నెల 28వ తేదీన ప్రతిపాదించిన ఈ రెండు సర్వీసులు అందుబాటులో ఉండవు. ఆపరేషనల్ కారణాల వల్ల వాటిని రద్దు చేసినట్లు సీపీఆర్ఓ తెలిపారు.












Click it and Unblock the Notifications