కుప్పకూలిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం వాల్, సొరంగం పనులలో 50మంది కార్మికులు!

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులలో ఈరోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇటీవల కాలంలో పనులను ప్రారంభించిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులలో నేడు చోటు చేసుకున్న ప్రమాదంలో కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. సొరంగంలో పనిచేస్తున్న కార్మికుల మీద సొరంగం మార్గం వద్ద ఉన్న రిటైన్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో కూలీలు టన్నెల్లో చిక్కుకుపోయారు.

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులలో కుప్పకూలిన రిటైన్ వాల్
ఈ దుర్ఘటనలో పలువురు కూలీలకు గాయాలు కాగా మరి కొంత మంది సిబ్బంది సొరంగంలోనే ఇరుక్కుపోయారు.నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ ఎల్ బి సి ఎడమ సొరంగం 14 వ కిలోమీటర్ల వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది .రిటైన్ వాల్ కుప్పకూలడంతో సొరంగ మార్గం వద్ద సుమారు మూడు కిలోమీటర్ల మేర పైకప్పు కుంగింది.

Major accident during Srisailam left bank canal tunnel works 50 workers in tunnel

ప్రమాద సమయంలో సొరంగంలో 50 మంది కార్మికులు
ఈ ప్రమాదం జరిగిన సమయం 50 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
నల్గొండ జిల్లాకు సాగునీటిని తాగు నీటిని అందించడం కోసం శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం ప్రాజెక్టును రూపొందించారు. శ్రీశైలం జలాశయం నుండి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల నీటిని తరలించాలి అన్నది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం.

గతంలో వైఎస్సార్ హయాంలో పరిపాలనా అనుమతులు
గతంలో ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ ప్రభుత్వం 2200 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులను ఇచ్చింది. 1925 కోట్ల రూపాయలతో దీనిని 60 నెలలలో పూర్తి చేయాలని ఓ నిర్మాణ సంస్థకు పనులకు కూడా ఒప్పుకుంది. అయితే గతంలో టన్నెల్ బోరింగ్ మిషన్ తో సొరంగం తవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు. వరద సమస్యలు వచ్చి పనులు ఆగుతూ వచ్చాయి.

చాలా కాలం తర్వాత పనులు ప్రారంభం .. కానీ ప్రమాదం
ఆ తర్వాత నిధుల కేటాయింపు జరగకపోవడం, టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురవడం వంటి కారణాలతో ప్రాజెక్టు పనులు మూలనపడ్డాయి. 2019 డిసెంబర్ నుంచి ఇంతకాలం వరకు ప్రాజెక్టు పనులు కొనసాగలేదు. అయితే ఇటీవల నల్గొండ మంత్రుల చొరవతో సొరంగం పనులు ఈ మధ్యనే మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇక ఈ సమయంలోనే మరొక ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+