వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ‘నీళ్లు’ కావాలా? కూటమి ‘కన్నీళ్లు’ కావాలా?: కేటీఆర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Assembly Elections 2018 : బాబు-రాహుల్ భేటీ పై కేటీఆర్ ట్వీట్ పంచ్ | Oneindia Telugu

మహబూబ్‌నగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మహా కూటమి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శించారు.

<strong>తెలంగాణ ఎన్నికలు: బిర్యానీ ధరలు తగ్గించాలన్న ఈసీ, తగ్గింపు ధరలివే</strong>తెలంగాణ ఎన్నికలు: బిర్యానీ ధరలు తగ్గించాలన్న ఈసీ, తగ్గింపు ధరలివే

ఈ ఎన్నికలు ఎంతో కీలకం

ఈ ఎన్నికలు ఎంతో కీలకం

కల్వకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ, ప్రజల భవిష్యత్తుకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కీలకమైనవని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ ‘నీళ్లు' కావాలా? కూటమి ‘కన్నీళ్లు' కావాలా?

కేసీఆర్ ‘నీళ్లు' కావాలా? కూటమి ‘కన్నీళ్లు' కావాలా?

‘కేసీఆర్ అందించిన ‘నీళ్లు కావాలా? లేక మహా కూటమి కన్నీళ్లు కావాలా?'' మీరే తేల్చుకోవాలని ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రజలను తక్కువ అంచనా వేసిన ఎన్టీఆర్ లాంటి మహానేతను కూడా ఓడించిన చరిత్ర కల్వకుర్తిదని అన్నారు.

తెలివిగా ఆలోచించండి

తెలివిగా ఆలోచించండి

ప్రస్తుతం కల్వకుర్తి ప్రజలకు మంచి రాజకీయ అవగాహన ఉందని, తెలివిగా ఆలోచించి ఓటేయాలని కేటీఆర్ కోరారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనన్ని ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఈ నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు.

వారివి దొంగ ఏడుపులు

వారివి దొంగ ఏడుపులు

ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలని మహాకూటమి కుట్రలు పన్నుతున్నాయని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ అభివృద్ధిని కోరుకోవడం లేదని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.

English summary
As part of his campaign to strengthen the Telangana Rashtra Samithi in the erstwhile Mahbubnagar district, KT Rama Rao has reached Kalwakurthy constituency to address the Praja Ashirwada Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X