Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Malkajgiri Lok Sabha Election 2024 Results LIVE: మల్కాజ్‌గిరి మొనగాడెవరంటే

మల్కాజ్‌గిరి లోక్ సభ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారాలు: దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజక వర్గం. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉప్పల్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ శాసనసభ స్థానాలతో పాటూ ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంటు స్థానాలూ ఉన్నాయి. మల్కాజ్‌గిరి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఎక్కువ ఫోకస్ అవుతున్న నియోజకవర్గం మల్కాజ్‌గిరిలో గెలిచేదేవరు?

మల్కాజ్ గిరి సో స్పెషల్ .. ఎందుకంటే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాజీనామా చేశారు. ఇక ఇదే స్థానం నుండి బిజెపిలో కీలకనేత అయిన ఈటల రాజేందర్ ఈసారి ఎన్నికల బరిలోకి దిగారు. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్, ఈటల రాజేందర్ వంటి దిగ్గజనేత బరిలోకి దిగడంతో బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Telangana lok sabha election results Malkajgiri lok sabha Election 2024 Results voting counting live updates news in telugu

ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో మల్కాజ్ గిరి ఎంపీ
సామాజిక రాజకీయ చైతన్యానికి చిరునామా అయిన మల్కాజ్‌గిరిలో మొత్తం 37 లక్షల 28 వేలమంది పైగా ఓటర్లున్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి ఓటమిపాలైన రేవంత్‌రెడ్డి ఆతర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టి, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా పార్టీని గెలిపించి ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

మల్కాజ్‌గిరిలో సమరం చేసిన మూడు పార్టీలు
అయితే, మల్కాజ్‌గిరిలో మారిన రాజకీయ సమీకరణల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీఆర్ ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి హోరాహోరీగా ఎన్నికలలో పోరాటం చేశారు. దీంతో మల్కాజ్‌గిరిలో త్రిముఖ పోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారు అన్నది చెప్పటం కష్టంగా ఉంది.

కాంగ్రెస్ కు అనుకూల అంశాలివే
రాష్ట్రంలో అధికారంలో ఉండట, ముఖ్యమంత్రి రేవంత్ గత ఎన్నికల్లో గెలుపొందిన స్థానం కావడంతో మల్కాజ్‌గిరిలో గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ లో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్, LB నగర్ BRS నేత రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ లో చేరటం, కంటోన్మెంటులో బీజేపీ నేత శ్రీగణేశ్ కాంగ్రెస్ లో చేరడమే కాక ప్రస్తుత ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి అవటం కాంగ్రెస్ కు అనుకూలాంశాలు.

మళ్ళీ విజయం తమదే.. కాంగ్రెస్ ధీమా
పట్నం సునీత మహేందర్ రెడ్డి తరఫున జాతీయ నాయకులతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు. దీంతో మళ్లీ విజయం తమదే అన్న ధీమాలో ఉన్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా ఈ స్థానాన్ని గెలిచి రాహుల్ గాంధీకి బహుమానంగా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వెనుక
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను గెలుచుకున్న BRS రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన ఆయన స్థానిక నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. అగ్రనేతలు కేటీఆర్, కెసిఆర్ కూడా ఆయన తరుపున ప్రచారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలోనే పడడంతో, ప్రజలు మళ్ళీ బిఆర్ఎస్ కే పట్టం కడతారని నమ్ముతున్నారు రాగిడి లక్ష్మారెడ్డి.

విజయంపై ధీమాతో బీజేపీ
ఇక బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. మల్కాజ్‌గిరి స్థానాన్ని కైవసం చేసుకుంటే తెలంగాణపై పట్టు సాధించవచ్చని ఆ పార్టీ భావన. ఉప్పల్ BRS నేత బేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరటం, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టిన తాజా అనేక పరిణామాలతో పాటు, రాజకీయాలలో మంచి పేరు ఉన్న ఈటల రాజేందర్ ని ఇక్కడ బరిలోకి దించడం బిజెపికి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇక్కడ తమదే విజయమని బిజెపి బలంగా నమ్ముతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+