కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే.. అన్ని వర్గాలకు సంక్షేమ మంత్రం!!
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించే దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ 13 రోజులు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీభవన్లో ఈరోజు మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 42 పేజీలతో 62 ప్రధాన హామీలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో ద్వారా ప్రజలను ఆకర్షించే అనేక పథకాలను పొందుపరిచిన కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రజాక్షేత్రంలోకి వెళుతుంది.

ఇప్పటికే ప్రచార పర్వాన్ని జోరుగా సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతో ప్రజల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, చేయూత, యువ వికాసం పేరుతో ఆరు గ్యారెంటీ లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది.
ఈరోజు మల్లికార్జున ఖర్గే రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోను అన్ని వర్గాలతో సంప్రదించి రూపొందించినట్లు, దీన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తున్నట్టు తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలాకు ఈ మేనిఫెస్టో ఉత్కృష్టమైన పత్రం అని ఆయన పేర్కొన్నారు. అభయహస్తం పేరిట విడుదల చేసిన ఈ మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక తూచ తప్పక అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
దాదపు 38 పాయింట్లతో కూడిన ఈ మేనిఫెస్టో లో ఆరు గ్యారంటీలు, రైతు, యువత, SC, ST, మైనారిటీ, BC, డిక్లరేషన్లు ప్రాధానంగా పొందుపరిచారు. రంగాల వారీగా తమ ప్రభుత్వ కార్యాచరణను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ఉద్దేశ్యాలను సంపూర్ణంగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర సంపదను అందరికీ పంచే ఉద్దేశ్యంతో అభయహస్తాన్ని సిద్దం చేసినట్లు చెప్పారు.
CLP నాయకుడు భట్టి విక్రమార్క,సహా సీనియర్ నాయకులు మేనిఫెస్టో విడుదల నేపధ్యంలో ప్రసంగించారు. ఉద్యమకారులను గుర్తించి, వారికి 250 గజాల ఇళ్ళ స్ధలం, గౌరవ భృతిని కల్పిస్తామనీ మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications