తెలంగాణ సీఎం పదవి ఆశించా.. కానీ.. భట్టి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తర్వాత సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. అయితే ఈ పదవిని కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్లు ఆశించారు. ఇందులో మధిర సీనియర్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతో పాటు హుజూర్ నగర్ ఎమ్మెల్యే, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అయితే వీరిద్దరికీ కీలక హామీలు ఇచ్చి అధిష్టానం రేవంత్ సీఎం అయ్యేందుకు మార్గం సుగమం చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి పదవి తనకు అందినట్లే అంది చేజారిపోవడంపై డిప్యూటీ సీఎం కాబోతున్న మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను తెలంగాణ సీఎం పదవి ఆశించిన మాట వాస్తవమేనని భట్టి విక్రమార్క తెలిపారు. అయితే సీఎం పదవి రాకపోయినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ప్రభుత్వంలో అందరికీ పదవులు దక్కడం అసాధ్యమని భట్టి పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని భట్టి విక్రమార్క్ వెల్లడించారు.

తెలంగాణ సీఎం ఎంపిక కోసం నిర్వహించిన సీఎల్పీ భేటీ తర్వాత ఆ పదవికి పోటీ పడిన సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఢిల్లీకి పిలిపించి బుజ్జగించింది. రేవంత్ రెడ్డిని సీఎంగా సమర్ధించాలని, భవిష్యత్తులో వీరిద్దరి బాధ్యత తమదేనని చెప్పినట్లు తెలిసింది. దీంతో భట్టితో పాటు ఉత్తమ్ కూడా శాంతించారు. అనంతరం వీరిద్దరి ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించారు. అప్పటి నుంచి మౌనంగానే ఉంటున్న భట్టికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన అధిష్టానం.. ఉత్తమ్ కు కీలక మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications