కలహాలు: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
నల్గొండ: జిల్లాలోని చందనపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్తే గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా స్థానికులు పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి దారుణహత్య
నిజామాబాద్ జిల్లా భిక్కనూరు శివారులో ఓ యువకుడు దారుణహత్యకు గురైయ్యాడు. గుర్తుతెలియని దుండగులు యువకుడిని బండరాళ్లతో మోదీ హత్య చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చిరుత దాడిలో దూడ మృతి
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గద్దెగూడెంలో చిరుత పులి సంచరిస్తుంది. ఓ పశువుల మందపై దాడి చేసి దూడను చంపింది. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు. చిరుత సంచారంపై అధికారులకు సమాచారం అందించారు.
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తారామతిపేటలో ఔటర్‌రింగ్‌రోడ్డుపై ఓ టిప్పర్ లారీ డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలైయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications