తొలుత అత్తారింట్లోనే కాపురం: ఇంట్లో నాల్గో భార్యను బంధించేవాడు

హైదారబాద్: పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బడా వ్యాపారినంటూ నమ్మించిన ఓ యువకుడు లక్షలాది రూపాయల కట్నం తీసుకొని యువతిని పెళ్లాడాడు. అప్పటికే మూడు పెళ్లిళ్లయ్యాయని ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు మోసపోయినట్లు గుర్తించి హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

షేక్‌పేట సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివాముంటున్న యువతి(19)ని పాతబస్తీలో వ్యాపారినంటూ నమ్మించిన సయ్యద్ యాసిర్ అహ్మద్(21) అనే యువకుడు గతేడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నాడు. కట్నం కింద రూ.30 లక్షలు, బంగారాన్ని తీసుకున్న యాసిర్.. కొంతకాలం అత్తారింటిలోనే ఉన్నాడు.

 Man arrested for ditching women in Hyderabad

తర్వాత ఓ ఇళ్లు అద్దెకు తీసుకొని వేరే కాపురం పెట్టాడు. భార్యను ఇంట్లోనే బంధించి బయటకు వెళ్లేవాడు. భరించలేక ఆమె ఇటీవల పుట్టింటికి వెళ్లింది. అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు యాసిర్‌ను నిలదీసేందుకు ఇంటికి వెళ్లగా ఖాళీ చేసి పరారయ్యాడని తేలింది. బాధితురాలి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై 498ఏ,420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పారామౌంట్‌ కాలనీకి చెందిన ఆ యువతి నిరుడు నవంబరులో సయ్యద్‌ యాసిర్‌ అహ్మద్‌ను వివాహం చేసుకుంది. దీనిపై అతన్ని నిలదీసే క్రమంలో కుటుంబంతో కలిసి పరారయ్యాడు. అయితే, అతన్ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+