హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య వేధింపులని భర్త ఆత్మహత్యాయత్నం: పెళ్లి మాటలు చెప్పి కోరిక తీర్చుకున్నాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భార్యతో పాటు ఆమె తరపు బంధువులు దాడి చేసి వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి హైదాబాదులోని ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే కాశయ్య ఎల్‌బీనగర్‌ కాకతీయనగర్‌కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు.

ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత కొంత కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. భార్యను తీసుకెళ్లటానికి వెళ్లగా ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు శుక్రవారం వెళ్లాడు. వారు స్పందించడం లేదని తనవెంట బాటిల్‌లో తీసుకెళ్లిన పెట్రోల్‌ శరీరంపై పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు అతడిని పట్టుకొని ఇన్‌స్పెక్టర్‌ పి. కాశిరెడ్డి వద్దకు తీసుకెళ్లారు. అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చామని, కేసు నమోదు చేయలేదని తెలిపారు.

ఇదిలావుంటే, పెళ్లి చేసుకుంటానని వికలాంగురాలిని మోసం చేసిన యువకుడిపై ఎల్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మనోజ్‌తో ఓ యువతికి పరిచయం ఏర్పడింది. ఒక కాలికి పోలియో రావడంతో ఆ యువతి సరిగా నడవలేదు.

Man attempts suicide alleging wife's harassment

ఆమెకు మాయమటాలు చెప్పి నమ్మించి అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2013 సంవత్సరం జూన్‌లో ఇబ్రహీంపట్నం తీసుకొచ్చాడు. భార్యాభర్తలమని చెప్పి ఓ వైద్యుడి ఇంట్లో అద్దెకు ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని మనోజ్‌ను యువతి కోరింది.

బీటెక్‌ పూర్తయిన తర్వాత చేసుకుంటానని నమ్మించి కోరిక తీర్చుకుంటున్నాడు. కొన్నాళ్లకు ఎల్‌బీనగర్‌ శివగంగ కాలనీకి మకాం మార్చారు. గతనెల 4వ తేదీన మనోజ్‌ కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. మనోజ్‌ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తన ఇంటర్నెట్ కేఫ్‌కు వచ్చిన యువతుల వ్యక్తిగత వివరాలను రహస్యంగా సేకరించటం, వాటిలోని సమాచారంతో బ్లాక్‌మెయిల్‌ చేసి నరకం చూపాడు ఓ ప్రబుద్ధుడు. దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోని ఇంటర్నెట్‌లో పనిచేసే ఉద్యోగి ఒకరు తమ వద్దకు వచ్చే యువతులు, విద్యార్థినులు, మహిళల ఈ-మెయిల్స్‌, సోషల్‌ మీడియా పాస్‌వర్డ్‌ లను రహస్యంగా తెలుసుకున్నాడు.

వారు వెళ్లిన తర్వాత యువతుల వివరాలను రాబట్టాడు. వాటిలోని ఫొటోలు, అంతర్గత అంశాలను చూపుతూ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. కొందరి వద్ద డబ్బులు కూడా డిమాండ్‌ చేశాడు బాధితుల ఫిర్యాదుతో వరంగల్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.

English summary
A man attempted to commit suicide alleging harassment by his wife at LB Nagar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X