కలెక్టర్, ఎస్పీలనే బుట్టలో వేశాడు: 'ఐక్యరాజ్య సమితి' ప్రతినిధినంటూ మోసం
ఖమ్మం: తాను ఐక్యరాజ్య సమితి ప్రతినిధిని అని చెప్పుకుంటూ నిరుద్యోగులకు టోకరా వేసిన వ్యక్తిని ఖమ్మం జిల్లా పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు. అతను పదో తరగతి వరకే చదివాడు. కానీ అతను కలెక్టర్, ఎస్పీ వంటి వారిని కూడా బుట్టలో వేశాడు.
స్వచ్ఛ భారత్, ఓటరు చైతన్యం వంటి పలు కార్యక్రమాల్లో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి హోదాలోనే పాల్గొన్నాడు. నిరుద్యోగులను మోసగించి పోలీసులకు చిక్కడంతో అతని బండారం బయటపడింది. గురువారం పోలీసులు నిందితుడి గురించి వివరాలు వెల్లడించారు.
కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయాలకు పక్కనున్న ఓ భవనం వద్ద నిరుద్యోగులు ఇటీవల గొడవకు దిగారు. పోలీసులు విచారణ జరపడంతో అతని గుట్టు రట్టయింది. నిందితుడి పేరు సునీల్ కుమార్.

కలెక్టర్, ఎస్పీ భవనాలను ఆనుకొని ఆన్న భవనాన్ని అద్దెకు తీసుకొని ఐక్యరాజ్య సమితి పేరుతో కార్యాలయం తెరిచాడు. ఢిల్లీ కేంద్రంగా నిర్వహించి యూనైటెడ్ స్కూల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యుడిగా చేరాడు.
అప్పటి నుంచి వరంగల్, ఖమ్మం నగరాల్లో విద్యా సంస్థల్లో ఆ సంస్థ తరఫున సదస్సులు నిర్వహించి కమీషన్ తీసుకునేవాడు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగిగా పరిచయం చేసుకున్నడు. జిల్లా ఉన్నతాధికారులతోను సాన్నిహిత్యం పెంచుకున్నాడు.
ఎలక్షన్ వాచ్ కన్వీనర్‌గాను తిరిగాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏడుగురు ఉద్యోగుల నుంచి రూ.19 లక్షలు తీసుకున్నాడు. దీంతో అతని మోసం బయటపడింది. అతను ఎంఏ వరకు చదివిట్లు చెబుతున్నాడు. కానీ పదో తరగతికి మించి మెమోలు లేవు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications