మానవ హక్కుల సంస్ధ ఛైర్మన్ ముసుగులో మహిళలకు వేధింపులు, అరెస్ట్

హైదరాబాద్: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధ ముసుగులో మోసాలు, అక్రమాలకు పాల్పడుతున్న షాదాత్ అహ్మద్‌పై సైబరాబాద్ పోలీసు కమిషనర్ పీడీ యాక్ట్ పెట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం జీడిమెట్ల సూరారం కాలనీ సాయిబాబా నగర్‌కు చెందిన షాదాత్ అహ్మద్ (34) ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ పేరుతో సంస్ధను స్ధాపించి తనకు తాను ఛైర్మన్‌గా ప్రకటించుకున్నాడు.

అంతేకాదు హ్యూమన్ రైట్స్ అనే పత్రికను ప్రారంభించాడు. ఆ సంస్ధ ముసుగులో కొన్నేళ్ల పాటు మోసాలు, అక్రమ కార్యాకలాపాలకు తెరలేపాడు. అక్రమ వసూళ్లు, ఫోర్జరీ, తన దారికి రాని వారిని నిర్భంధించడం, మోసాలకు పాల్పడుతున్నాడు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

Man claims to be rights activist loots, arrested in Cyberabad

తన అనుచరులతో కాన్వాయ్‌ను సృష్టించుకుని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఛైర్మన్‌గా చలామణి అవుతున్న షాదత్ అహ్మద్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 9 క్రిమినల్ కేసులు పెట్టారు. మార్పు రాకపోడవంతో పీడీ యాక్ట్‌ను విధించి అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించామని కమిషనర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+