వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛీ వీడి క‌క్కుర్తిలో క‌మండ‌లం..! పానీ పూరి కోసం ప్రాణం తీసుకున్నాడు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : క్ష‌ణికావేశం ఎంత అన‌ర్థానికి దారితీస్తుందో ఈ ఉదంతం గురించి తెలుసుకుంటే స‌రిపోతుంది. విచ‌క్ష‌ణ కోల్పోతే, ఆవేశం క‌ట్ట‌లు తెచ్చుకుంటే ఎంత అదఃపాతాళానికి నెట్ట‌బ‌డ‌తామో ఈ ఉదాహ‌ర‌ణ చెప్ప‌క‌నే చెబుతుంది. కేవంలం ప‌ది రూపాయాల పానీ పూరీ కోసం నిండు ప్రాణం బ‌లైంది. క‌న్న వాళ్ల‌కు, ఐన వాళ్ల‌కు తీర‌ని శోకాన్ని మిగిల్చింది. స‌మ‌యం కాని స‌మ‌యంలో ఎవ‌రి మీదో దౌర్జ‌న్యం చేద్దాం అనుకుంటే అది త‌ప్ప‌కుండా స్వ‌యంక్రుతాప‌రాధానికి దోహ‌ద ప‌డుతుంది. ఇలాంటి సంద‌ర్బాల్లో ఊహించ‌ని మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది. పానీ పూరి బండి వద్ద జరిగిన గొడవలో గాజు గ్లాసు పగిలి ఓ వ్యక్తి చేతికి తీవ్రగాయమైంది. ఆసుపత్రికి తరలించే లోపు ఏకధాటిగా రక్తం కారడంతో సదరు వ్యక్తి మృతి చెందిన ఘటన పహాడీషరీఫ్ పోలీసు స్టేష‌న్ పరిధిలో చోటుచేసుకుంది.

Man died for Pani Puri..! Incident took place in Hyderabad..!!

తుక్కుగూడకు చెందిన ఇర‌వై ఎనిమిది ఏళ్ల కట్టెల శ్రీనివాస్ రాత్రి పది గంటల ప్రాంతంలో మద్యం మత్తులో తన బైకుపై స్థానికంగా ఉన్న చౌరస్తాలోని పానీ పూరి బండి వద్దకు వెళ్లాడు. పానీపూరి ఇవ్వాలని అడగ్గా, అయిపోయిందని సదరు నిర్వాహకుడు చెప్పాడు. తనకే లేదని సమాధానం చెబుతావా అంటూ శ్రీనివాస్‌ అతనితో ఘర్షణ పడ్డాడు. ఇదేమిటని అక్కడే ఉన్న మ‌రో వ్యక్తి శ్రీనివాస్‌ను వారించాడు. మరింత కోపోద్రిక్తుడైన శ్రీనివాస్‌ పానీపూరి బండిపై గట్టిగా చ‌రిచాడు. దీంతో అక్కడ ఉన్న గాజు గ్లాసు పగిలి శ్రీనివాస్‌ కుడి చేతి నరానికి తగిలి తీవ్రగాయమైంది. గాజు ముక్కలు గాయంలో ఇరుక్కుపోవడంతో రక్తం ధారలా కారింది. గొడవ విషయం స్థానికులు పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి అతన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చాలా రక్తం పోవడంతో శ్రీనివాస్‌ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో తుక్కుగూడ లోని మ్రుతిని ఇంట్లో తీర‌ని విషాదం అలుముకున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
Twenty-eight-year-old Kattela Srinivas of Tukugudu went to the Pani Puri booth at Chauraasta on his bay in a dump of alcohol in ten o'clock in the night. Asked to give panipuri, the Pani Puri Wala said time is up. Srinivas got confrontation with him broken glass which was made wound to his hand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X