విహారయాత్రలో విషాదం: జూపార్క్‌లో సెల్ఫీ దిగుతూ విద్యార్థి మృతి
హైదరాబాద్: నగరంలోని జూపార్క్‌లో మంగళవారం నాడు విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థి ముంజిత్ కుమార్ సెల్ఫీ తీసుకుంటూ దుర్మరణం పాలయ్యాడు. సోమవారం నాడు పదో తరగతి పరీక్షలు ముగిశాయి.

దీంతో, కొందరు పదో తరగతి విద్యార్థులు జూపార్క్‌కు విహారయాత్రకు వచ్చారు. మంగళవారం నాడు అందరూ జూలో సందడి చేశారు. అయితే, సీతాకోకచిలుకల పార్కులో ముంజీత్ కుమార్ సెల్ఫీ దిగుతుండగా కరెంట్ తీగలు తగిలి మృతి చెందాడు. మృతుడు పురానాపూల్‌కు చెందినవాడు.

రాజేంద్రనగర్‌లో నకిలీ చాక్లెట్ల తయారీ కంపెనీపై దాడి
రాజేంద్రనగర్‌లో నకిలీ చాక్లెట్ల తయారీ కంపెనీపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కంపెనీలో ఉన్న చాక్లెట్లు, పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ సొంటి తయారీదారులు అరెస్టు
నకిలీ శొంఠి తయారు చేస్తున్న కంపెనీపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తోండుపల్లిలో చోటుచేసుకుంది. సోదాల సందర్భంగా పోలీసులు భారీగా నకిలీ సొంటిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications