నాని సినిమా షూటింగ్‌లో అపశ్రుతి: వ్యక్తి మృతి
హైదరాబాద్: ఓ సినిమా షూటింగులో అపశ్రుతి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పరిధిలోని సంఘీనగర్‌లో శనివారం నాని హీరోగా నటిస్తు్న ఓ చిత్రం షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ సమయంలో తిరుపతి అనే వ్యక్తి కరెంట్ షాక్‌తో మరణించాడు.
ఆ సంఘటనతో భయపడిపోయిన యూనిట్ సిబ్బంది షూటింగ్ నిలిపేసి వెళ్లిపోయారు. తిరుపతి మృతదేహాన్ని కూడా అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఇదిలావుంటే, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన ప్రతాని రాజు (21), పుట్టి ప్రశాంత్ (21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు.












Click it and Unblock the Notifications