సెల్‌ఫోన్లో వీడియో కోసం సాహసం, గల్లంతై తెల్లారి శవమై తేలాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో ఈత కొడుతూ, వీడియో తీయమని చెప్పి మృతి చెందిన లకావత్ శ్రీనివాస్ ఎస్సై దేహదారుఢ్య పరీక్షలోనెగ్గి, మెయిన్స్ కోసం సన్నద్ధం అయ్యేందుకు మంగళవారం నాడే హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది.

ఈ సమయంలో అతను ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. శ్రీనివాస్ డిగ్రీ పూర్తి చేశాడు. అతను కానిస్టేబుల్, ఎస్సై మెయిన్స్‌కు సన్నద్దం అవుతున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

చెరువులో దూకి మృతి

చెరువులో దూకి మృతి

కోనాపూర్‌ చెరువులో సోమవారం సాయంత్రం స్నానానికి వెళ్లి గల్లంతైన శ్రీనివాస్ మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. సమాచారం మేరకు... కోనాపూర్‌ పంచాయతీ పరిధిలోని పులిగుండుతండాకు చెందిన శ్రీనివాస్‌ స్నేహితుడు గోపాల్‌తో కలిసి చెరువు వద్దకు వెళ్లాడు.

చెరువులో దూకి మృతి

చెరువులో దూకి మృతి

తాను చెరువులో దూకుతానని అది సెల్ ఫోన్లో వీడియో తీయమని స్నేహితుడు గోపాల్‌కు చెప్పాడు. నీళ్లు ఎక్కువగా ఉన్నాయని వెళ్లొద్దని అతను చెప్పిన శ్రీనివాస్ వినలేదని తెలుస్తోంది. తనకు ఈత వచ్చునని, సరదాగా వెళ్లి వస్తానని చెరువులో దూకాడు.

చెరువులో దూకి మృతి

చెరువులో దూకి మృతి

ఆ తర్వాత లోతు ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్లి మునిగిపోయాడు. కంగారుపడిన స్నేహితుడు గ్రామస్థులకు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. తొలుత స్నేహితులు భయంతో సమాచారం ఇవ్వలేదని వార్తలు వచ్చినప్పటికీ, వారు విషయం చెప్పారు.

చెరువులో దూకి మృతి

చెరువులో దూకి మృతి

అందరూ చెరువు వద్దకు చేరుకుని రాత్రి వరకు గాలించారు. మంగళవారం ఉదయం మృతదేహం నీటిలో తేలియాడింది. దానిని పోలీసులు బయటకు తీశారు. తన కొడుకు ఎస్సై అవుతాడనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Man Dies swimming in konapur Lake on Tuesday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X