దుబాయ్ నుంచి వచ్చాక!: ఆమె వేధింపులు భరించలేక.. యువకుడి ఆత్మహత్య
వివాహిత వేధింపులతో రమేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మెదక్: ఓ వివాహిత వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివాహిత అయిన ఓ మహిళ తనను పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బోనగరి రమేష్(23) అనే యువకుడు ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. మూడు నెలల క్రితమే తిరిగొచ్చి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత తనను పెళ్లి చేసుకోవాలని వేధించినట్టు తెలుస్తోంది.

వివాహిత వేధింపులతో రమేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతిపై అతని తండ్రి మొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications