తీవ్ర కలకలం: ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో పిస్టల్‌తో వ్యక్తి
న్యూఢిల్లీ: హైదరాబాదులోని ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో 24 ఏళ్ల యువకుడు మంగళవారం రాత్రి పట్టుబడ్డాడు. ఆయుధం తన యజమానిదని అతను భద్రతా సిబ్బందికి చెప్పాడు. అతన్ని టి. సతీశ్ కుమార్‌గా గుర్తించారు. కరీంనగర్ జిల్లాకు చెందినవాడు.
మెట్రో స్టేషన్ సిబ్బంది తనిఖీ చేస్తుండగా అతని వద్ద ఆయుధం ఉన్నట్లు తేలింది. 7.65ఎంఎం పిస్టల్‌తో పాటు ఎనిమిది లైవ్ రౌండ్లు అతని వద్ద ఉన్నాయని ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లు చెప్పారు.

పిస్టల్ కాటారం జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యుడు చల్లా నారాయణ రెడ్డి పేరు మీద దానికి లైసెన్స్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. సతీష్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.
నారాయణరెడ్డి వ్యాపారం పనుల మీద పూణే వెళ్తూ పిస్టల్‌ను సతీష్ కుమార్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. పిస్టల్ కనిపించడంతో మెట్రో స్టేషన్‌లో కలకలం చెలరేగింది.












Click it and Unblock the Notifications