విమానాశ్రయంలో వ్యక్తి కిడ్నాప్: హిజ్రా దారుణ హత్య
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన బాపూరావును కిడ్నాప్ చేశారని అతని భార్య శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చిన తన భర్త కిడ్నాప్‌కు గురయ్యాడని ఆమె చెప్పింది. శంషాబాద్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరం కూకౄట్‌పల్లిలోని సిక్కుల బస్తీలో ఓ హిజ్రా హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండుగులు హిజ్రాను కత్తితో పొడిచి చంపారని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.
మంజా దారం మెడను కోసింది
మాంజా దారం ఓ వ్యక్తి మెడ కోసిన ఉదంతం ఒకటి జరిగింది. హైదరాబాద్ నగర శివార్లలోని చందానగర్‌కు చెందిన మొగులయ్య తన కూతురితో కలిసి స్కూటర్‌పై శుక్రవారం వెళుతుండగా మాంజా దారం తగిలి గొంతు కోసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన మొగులయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

ఇద్దరు దొంగల అరెస్టు
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కిలో బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంట్లో భారీ చోరీ
ఇదిలావుంటే, హైదరాబాదులోని అంబర్‌పేట న్యూపటేల్ నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 21 తులాల బంగారం, రూ. 3 లక్షల నగదు దోచుకెళ్లారు. బాధితులు అంబర్‌పేట పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
హైదరాబాదులోని కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువులు ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications