దారుణం: భార్యను గొంతు నులిమి చంపేశాడు
హైదరాబాద్: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తాడుతో భార్య గొంతు నులిమి హత్య చేశాడు. హైదరాబాదులోని పాతబస్తీలో గల మిస్రీగంజ్‌కి చెందిన షబానాబేగం (28), మహ్మద్ అలీకి 8 నెలల క్రితం వివాహమైంది. షబానా బేగంకు ఇదివరకే వివాహం కాగా, మహ్మద్ అలీకి కూడా వేరే యువతితో వివాహం జరిగింది.
మూడు సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయిన షబానా బేగం మహ్మద్ అలీని వివాహం చేసుకుంది. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం అర్థరాత్రి అలీ తాడుతో భార్య గొంతునులిమి హత్య చేశాడు. పరారీలో ఉన్న మహ్మద్ అలీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రియల్టర్‌పై హత్యాయత్నం

హైదరాబాద్ పాతబస్తీలో ఓ రియల్టర్‌ను హతమార్చేందుకు ఇద్దరు రౌడీషీటర్ల ప్రయత్నాన్ని టాస్క్ఫోర్సు పోలీసులు భగ్నం చేశారు. అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి మూడు కత్తులు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి సౌత్ జోన్ టాస్క్ఫోర్సు డిసిపి కోటిరెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఫలక్‌నుమా సమీపంలోని వట్టేపల్లిలో నివాసముంటే అక్బర్(45) వృత్తిరీత్యా రియల్టర్. స్థానికంగా ఉన్న 400 చదరపు గజాల ఓ ప్లాటుకు సంబంధించిన వివాదం, గతంలో జరిగిన షూటర్ షారూక్ హత్య కేసుతో అక్బర్‌కు సంబంధం ఉందంటూ స్థానిక ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్ అయిన జావీద్‌ఖాన్ (45), మహారాష్ట్ర మాలేగావ్‌కు చెందిన మరో రౌడీషీటర్ జమీల్(24)లతో పాటు మరో నిందితుడు అక్బర్‌ను కొంతకాలంగా బెదిరిస్తున్నారు.
పైగా, తరుచూ వట్టేపల్లికి రాకపోకలు సాగిస్తున్న అక్బర్‌ను హత్య చేసేందుకు రెక్కీ కూడా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు రంగంలో దిగిన పోలీసులు రౌడీషీటర్లు జావీద్ అలియాస్ జాడో, జమీల్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల అనుచరుడు ముస్త్ఫా పరారీలో ఉన్నట్లు, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications