అక్రమ సంబంధమనే అనుమానంతో ప్రేయసి హత్య: బాలికపై రేప్ యత్నం
హైదరాబాద్: మరో వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్నదనే అనుమానంతో ప్రేయసిని హత్యచేసిన ప్రియుడిని హైదరాబాదులోని అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సుల్తాన్ బజార్ ఏసీపీ గిరిధర్ సోమవారం మీడియా సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్ ఫరీదాబాద్‌కు చెందిన మహేష్ తమ ఇంటి ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెను ఇటీవల నగరానికి తీసుకొచ్చి సీతారామ్‌బాగ్ రిసాల అబ్దుల్లా ప్రాంతంలో నివసిస్తున్నాడు. మహేష్ స్పేర్‌పార్ట్స్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆమె ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ప్రతి చిన్నవిషయానికి కొట్టేవాడు.

గతనెల 17వ తేదీన గొడవ జరగడంతో పట్టలేని కోపంతో ఆమె శరీరంపై కిరోసిన్‌పోసి నిప్పంటించి పారిపోయాడు. తీవ్రగాయాలైన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ నిరుడు డిసెంబర్ 26న మృతి చెందింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న మహేష్‌ను అఫ్జల్‌గంజ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ వెళ్లి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై అత్యాచారం చేయబోయిన వ్యక్తిని హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళానికి చెందిన రామారావు శ్రీనగర్‌కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న భవనంలో పనిచేస్తున్నాడు. సోమవారం ఓ బాలిక(3)కు చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి అపార్ట్‌మెంట్‌లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయబోయాడు. గమనించిన స్థానికుల అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications