అక్రమ సంబంధమనే అనుమానం: భార్యను గొంతు కోసి చంపేశాడు
హైదరాబాద్: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణం సంఘటన హైదరాబాదులోని రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. యాకుత్‌పుర హఫీజ్‌నగర్‌కు చెందిన ఆరీఫ్‌కు 2011లో తహసీన్ ఫాతిమాతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
ఆరీఫ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆరీఫ్ భార్యను అనుమానిచడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తగాదాలు పెరుగుతూ వచ్చాయి. గురువారం రాత్రి భోజనాలు ముగించుకున్న దంపతులు నిద్ర పోయారు.

శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆరీఫ్ తహసీన్ గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆరీఫ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆరీఫ్ ఇంట్లో నుంచి రక్తం బయటకు రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆరీఫ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో ప్రతిరోజూ గొడవ పడేవాడు. గురువారం రాత్రి నిద్రపోయిన ఆమెను కూరగాయల కత్తితో గొంతు కోశాడు. పిల్లలు తల్లిని శుక్రవారం ఉదయం లేపడానికి ప్రయత్నించాడు. రక్తపు మడుగులో పడి ఉండటం చూసి స్థానికులకు చెప్పారు. రెయిన్‌బజార్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications