నడిరోడ్డుపై భార్యను దారుణంగా!: వేములవాడలో భర్త కిరాతకం..

Subscribe to Oneindia Telugu

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను నడిరోడ్డు మీద గొంతు కోసం హతమార్చాడు. అనంతరం అతను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బాలరాజు(30), వసంత(25) భార్యాభర్తలు. వసంత పుట్టినిల్లు వేములవాడ. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

A man cuts throat of his wife and he himself attempted suicide in Vemulavada on Tuesday.

వేములవాడలో మంగళవారం బాలరాజు హఠాత్తుగా భార్యపై దాడికి దిగాడు. ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే బాలరాజు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man cuts throat of his wife and he himself attempted suicide in Vemulavada on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X