మద్యం మత్తులో గొంతుపై కాలితో నొక్కి భార్యను చంపేశాడు
హైదరాబాద్: జీవితాంతం కలిసి ఉంటానని హామీ ఇచ్చిన ఓ వ్యక్తి భార్యను గొంతుపై కాలితో నొక్కి దారుణంగా చంపేశాడు. హైదరాబాదులోని తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం - శ్రీనివాస్(40), సాంబ అలియాస్ సబిత(36) దంపతులు నిర్మల్ ప్రాంతానికి చెందినవారు.

వీరికి ఇద్దరు కొడుకులు శివకుమార్, నర్సింహ సంతానం. శ్రీనివాస్ పెయింటింగ్ పనిచేస్తుండగా, సబిత ఇళ్లల్లో పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. తుకారాంగేట్ వడ్డెరబస్తీలోని పోచమ్మ ఆలయం వద్ద కాపురం ఉంటున్నారు. శ్రీనివాస్ మద్యం తాగి నిర్మల్‌కు వెళ్దామని తరుచు సబితతో గొడ పడుతుండేవాడు. సబిత మాత్రం ససేమిరా అంటూ వచ్చింది.
ఆగ్రహించిన శ్రీనివాస్ రెండు రోజులుగా పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటూ మద్యం తాగుతున్నాడు. భార్యను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. గురువారం మధ్యాహ్నం సబితను శ్రీనివాస్ తీవ్రంగా కొట్టాడు. అదే సమయంలో ఇంటి పక్కనుండే శివకుమార్ మంచినీరు కోసం శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్యను కొడుతున్న శ్రీనివాస్‌ను గమనించి ఆపే ప్రయత్నం చేశాడు.

నీకు సంబంధం లేని విషయం వెళ్లి పోమ్మని చెప్పి పంపించాడు. సబిత గొంతుపై శ్రీనివాస్ గట్టిగా కాలు పెట్టి ఆమె చనిపోయిందని నిర్థారించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గోపాలపురం ఏసీపీ శివకుమార్, తుకారాంగేట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ వచ్చి పరిశీలించారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications