లైంగిక వాంఛ తీర్చలేదని వివాహితను హత్య చేసిన కిరాతకుడు
సంగారెడ్డి: మెదక్ జిల్లాలో జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. లైంగిక వాంఛ తీర్చనందుకు ఓ యువకుడు ఆమెను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. నేరాన్ని అతను అంగీకరించాడు.
ఈ నెల 1వ తేదీన పుల్‌కల్ మండలం ముదిమాణిక్యం శివారులో జరిగిన మహిళ హత్య కేసు వివరాలను మెదక్ ఇంచార్జీ డిఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు బుధవారం జోగిపేటలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ పంచాయతీ పరిధిలోని సువాలీ తండాకు చెందిన గోరాం సుశీల (30) సురేష్ భార్య.
ఆ దంపతులు సంగారెడ్డిలో అడ్డా కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తలు విడివిడిగా పనులు చేసుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీన ఆమె పనుల కోసం సంగారెడ్డి వెళ్లి తిరిగి రాలేదు. మర్నాడు ఆమె శవం ఓ బావిలో లభించింది.
సుశీల ఫోన్ కాల్స్ ఆధారంగా బస్వాపూర్‌కు చెందిన వెండికోలు రాజును నిందితుడిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుశీల వెండికోలు రాజుకు గత రెండు నెలలుగా సన్నిహితంగా ఉంటూ వస్తోంది. రెండు నెలల్లో సెల్‌ఫోన్‌లో 274 సార్లు ఇద్దరు మాట్లాడుకున్నారు.
ఘటన జరిగిన రోజున ఆ స్థలంలోని టవర్లను పరిశీలించగా కేవలం సుశీల, రాజుకు సంబంధించిన ఫోన్ నెంబర్లు మాత్రమే పనిచేసినట్లు తేలింది. బుధవారంనాడు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.

ఆ రోజు ఏం జరిగింది....
జూన్ 1వ తేదీన సంగారెడ్డి నుంచి రాజు, సుశీల ఒకే బస్సులో పక్కప్కనే కూర్చుని వచ్చారు. సాయంత్రం 6.15 గటలకు ముదిమాణిక్యం గ్రామంలో సుశీల దిగింది. బస్వాపూర్‌లో దిగి రాజు ఇంటికి వెళ్లాడు. అప్పుడు రాజు సుశీలకు ఫోన్ చేశాడు. తాను ఇంటికి వెళ్లి వెంటనే వస్తానని, ముదిమాణిక్యం వద్దే ఉండాలని రాజు సుశీలకు చెప్పాడు. అప్పుడే సుశీలకు భర్త సురేష్ పోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు.
తాను ముదిమాణిక్యం కల్లు దుకాణం వద్ద ఉన్నట్లు చెప్పింది. తండాకు బయలుదేరాలని,త తాను ఎదురుగా వస్తానని భర్త చెప్పాడు. వెంటనే ఇదే విషయాన్ని ఆమె రాజుకు చెప్పింది. అయినా వినిపించుకోకుండా తాను వచ్చే వరకు ఉండాలని పట్టుబట్టాడు. అయితే, ఆమె వినిపించుకోకుండా ముదిమాణిక్యం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న సువాలీ తండాకు బయలుదేరింది.
రాజు ఫోన్ చేస్తూ ఉంటే ఆమె కట్ చేస్తూ ముందుకు నడిచింది. దాంతో అతను త్వరగా వచ్చి మార్గమధ్యలో అడ్డగించాడు. సురేష్ వస్తున్నాడు, వెళ్లిపోవాలని చెప్పినా రాజు వినలేదు. తన కోరిక తీర్చాలంటూ పట్టుబట్టాడు. ఆమె వినకపోవడంతో పక్కనే ఉన్న విద్యుత్తు వైరును ఆమె గొంతుకు బిగించి గట్టిగా లాగాడు.
దాంతో ఆమె ప్రాణాలు విడిచింది. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని సమీపంలోని బావిలో తోసేశాడు. ఆ తర్వాత బస్వాపూర్‌కు వెళ్లిపోయాడు.












Click it and Unblock the Notifications