లొంగదీసుకుని బాలికను గర్భవతిని చేసిన కామాంధుడు
నిజామాబాద్: ఓ యువకుడు మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకోవడంతో గర్భం దాల్చింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక బుస్సాపూర్‌లోని ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది. బాలిక వారంరోజులుగా అనారోగ్యంగా ఉండటం తో దవాఖానకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సూచించారు.
రెండు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఉపాధ్యాయులు బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. బాలిక తల్లిదండ్రులు బుధవారం పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో వైద్యులతో పరీక్షలు చేయించారు. పరీక్షలలో బాలిక గర్భవతి అని తేలింది. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలుపడంతో వారు బాలిక ను నిజామాబాద్ తరలించాలని సూచించారు.

వారి ఆదేశాల మేరకు గురువారం విద్యార్థిని నిజామాబాద్ తరలించారు. బాలిక గర్భం దాల్చడానికి గ్రామానికి చెందిన ఓ యువకుడు కారణమని స్థానికులు అంటున్నారు. ఇలాంటి సం ఘటనలు పునరావృతం కాకుండా దోషిని గు ర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కూతురితో పాటు వివాహిత అదృశ్యం
నిజమాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన దస్తరి మౌనిక అనే వివాహితతో పాటు ఆమె రెండేళ్ల కూతురు జోత్స్న మూడు రోజులుగా కనిపించడం లేదని ఆమె భర్త సంతోష్ గురువారం మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై టి.శ్రీహరి తెలిపారు. ఆయన వివరాలను అందించారు.
నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన మౌనిక నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. భర్త సంతోష్ గంజ్‌లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజులాగే ఈనెల 22వ తేదీన కూతురును తీసుకొని ఇంట్లోంచి వెళ్లిన ఆమె తిరిగిరాలేదని, ఆమె కోసం వెతికినా ఎక్కడ ఆచూకీ లభించలేదని భర్త సంతోష్ తన ఫిర్యాదులో చెప్పాడు.
చివరకు బాధితుడు సంతోష్ మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై వివరించారు.












Click it and Unblock the Notifications