ఒంటరిగా ఉన్న వదినపై మరిది అత్యాచారం, ఫతేనగర్‌లో దారుణహత్య
హైదరాబాద్: తనపై మరిది అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ మొగల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సుల్తాన్ షాహి ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు సౌదీ అరేబియాలో ఉంటున్నారు.
అన్నదమ్ముల్లో పెద్దవాడికి పెళ్లి అయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమెను ఇక్కడే నగరంలో ఉంచాడు. రెండు నెలలు రంజాన్ సెలవులపై తమ్ముడు హైదరాబాద్‌కు వచ్చాడు. ఒంటరిగా ఉన్న వదినపై అత్యాచారం చేశాడు.
తమ్ముడు సౌదీ అరేబియాకు వెళ్లిన తర్వాత వదిన అతడికి అసభ్యకర మెసేజ్ పంపింది. ఆ మెసేజ్‌ను చూసిన అన్న, భార్యకు ఫోన్ చేసి ఏంటీ అసభ్యకర మేసెజ్ అని అడిగాడు. దీంతో మీ తమ్ముడు రంజాన్ సెలవులకు వచ్చినప్పుడు బెదిరించి నాపై అత్యాచారం చేశాడని చెప్పింది.

దీంతో భార్యకు విడాకులు ఇస్తానని చెప్పి పుట్టింటికి పంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమ సంబంధంతో ఫతేనగర్‌లో దారుణహత్య
అక్రమ సంబంధం ఓ వ్యక్తి దారుణహత్యకు దారితీసింది. నగరంలోని ఫతేనగర్‌లో దయానంద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. రైల్వేట్రాక్ పక్కన దయానంద్ మృతదేహం లభ్యమైంది. మృతుడు మహారాష్ట్రలోని లాతూరు వాసిగా గుర్తించారు.
మృతుడు చనిపోవడానికి అక్రమ సంబంధమే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తలో తేలింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications