నీచం: కోడలిని చెరబట్టిన మామ, మూడు సార్లు రేప్
నిజామాబాద్: నిజమాబాద్ జిల్లా కామారెడ్డి మండలం దేవునిపల్లిలో కోడలిపై ఓ వ్యక్తి అత్యంత నీచానికి పాల్పడ్డాడు. రెండు నెలల క్రితం మూడు సార్లు అతను కోడలిపై అత్యాచారం జరిపాడు. ఆ వ్యక్తిని శుక్రవారం కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన తన మామ మంగళి రాములు 2016 ఎప్రిల్ 27న మూడు సార్లు తనపై బలవంతంగా అత్యా చారం చేసినట్లు మైనర్ బాలికను(16) బుధవారం దేవునిపల్లి పోలీసులకు మామపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.

రాములు కుమారుడికి మొదటి పెళ్లి 2007లో జరుగింది. కుమారుడికి కోడలితో విడాకులు అయ్యాయి. రెండోపెళ్లి 2016ఎప్రిల్ 2న గాంధారి మండలం రాంపూర్‌గడ్డ నుంచి దేవునిపల్లికి చేసుకున్నారు. శుక్రవారం కొత్త బస్టాండ్ నుంచి రాములు పరారీ అవుతున్నట్లు సమాచారం రావడంతో దేవునిపల్లి ఎస్సై సంతోష్‌కుమార్, సిబ్బందితో వెళ్లి రాములును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.
పెళ్లి నచ్చక వివాహిత ఆత్మహత్య
ఇదిలావుంటే వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన వివాహిత పురాణి లావణ్య(24) ఇం ట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరా లు ఇలా ఉన్నాయి. తాడ్వాయి మండలం అన్నా రం గ్రామానికి చెందిన లావణ్యకు అంక్సాపూర్ గ్రామానికి చెందిన కాశీరాంతో రెండు నెలల క్రితం వివాహమైంది.
కాశీరాం గ్రామంలోని దాబా హోటల్‌లో పనిచేస్తుంటాడు. తనకు ఇష్టం లేకు న్నా కాశీరాంతో వివాహం చేశారని లావణ్య అంటూ ఉండేదిని స్థానికులు తెలిపారు. మనస్తాపాని కి గురై ఇంట్లో ఉరివేసుకొని ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా తన కూతురు మృతికి అల్లుడు కాశీరామే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications