అమ్మాయిపై పెదనాన్న అత్యాచారం, భరించలేక పారిపోయింది

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వావివరుసలు మరిచి ఓ అమ్మాయిపై పెదనాన్న అత్యాచారం చేశాడు. తమ్ముడి బిడ్డపై అతను దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన హైదరాబాదులోని కాచిగుడా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. లింగంపల్లిలో వినాయక దేవాలయం సమీపంలో ఉంటున్న వ్యక్తి ఆనంద్ (56) బషీర్‌ బాగ్‌లో టైలర్‌ షాపు ఉంది.

అతడి ఇంటి పక్కనే సోదరుడు రామకృష్ణ నివాసం ఉంటున్నాడు. తమ్ముడి 15 ఏళ్ల కూతురిపై అతని కన్ను పడింది. రెండుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇటీవల కామాంధుడి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక ఈ నెల 14న తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది.

Man sexually attacks on brother's daughter in Hyderabad

బాలిక అదృశ్యంపై తండ్రి కాచిగూడ పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశాడు. ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. బాలికను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామని, కామాంధుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించా మని ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు.

రామకృష్ణ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా అతడి భార్య ఏడాది క్రితం చనిపోయింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉండే అమ్మాయిని వశపరుచుకోవాలని కొంత కాలంగా ఆనంద్ ప్లాన్ వేశాడు. ఫిబ్రవరి, జూన్‌లో బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అనేక మార్లు ఇంట్లో, బషీర్‌బాగ్‌లో టైలర్ షాపునకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. చివరకు చేసిన నేరాన్ని అతడు ఒప్పుకున్నాడు. ఈ మేరకు గురువారం ఆనంద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man has sexually assaulted on his brother's daughter in hyderabad. the man annad has been arrested.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి