Divorce: విడాకులు తీసుకున్న సినీస్టార్స్ వీళ్లే..
సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు ఏం చేసినా ప్రత్యేకంగా నిలుస్తుంది. వారు ఏం చేసినా వార్తల్లో నిలుస్తారు. తాజాగా కొణిదెల నిహారిక విడాకులు తీసుకోవడంతో వార్తల్లో నిలిచారు. విడాకుల పై నిహారికా స్పందించారు. భర్త చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమయం తమ ఇద్దరికీ చాలా కీలకమని చెప్పిన నిహారిక.. తమను ఇబ్బంది పెట్టొద్దంటూ ఇన్స్‌టాగ్రామ్ వేదికగా కోరారు. అయితే సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా చాలా మంది స్టార్స్ విడాకులు తీసుకున్నారు.
విలక్షణ నటుడు కమల్ హాసన్ 1978లో వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. 1988లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి సారికను పెళ్లి చేసుకుని 2002లో విడాకులు తీసుకున్నారు. నాగార్జున తన మొదటి భార్యకు విడాకులిచ్చారు. 1984లో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామనాయుడు కూతురు, వెంకటేష్ సోదరి లక్ష్మిని నాగార్జున పెళ్లి చేరుకున్నారు. వారు 1990 విడాకులు తీసుకున్నారు. అయితే అప్పటికే వారికి నాగచైతన్య జన్మించాడు. ఆ తర్వాత నాగార్జున అమలను వివాహం చేసుకున్నారు.

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. తాజాగా మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. భూమా మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. నటి రాధిక 1985లో ప్రతాప్ పోతన్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోతన్ కు విడాకులిచ్చారు. 2001లో హీరో శరత్ కుమార్ వివాహం చేసుకున్నారు. యువ జంట నాగచైతన్య-సమంతలు 2017, అక్టోబర్ 7న పెళ్లి చేసుకున్నారు. 2021 వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications