రేవంత్‌కు షాక్: ఆ కీలక నేతలు యూటర్న్, రాహుల్‌కు లిస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో రేవంత్ రెడ్డికి షాక్ తగలనుందా? ఆయనతో వెళ్లేందుకు కొందరు నేతలు యూటర్న్ తీసుకుంటున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

  కాంగ్రెస్ కాకుంటే మరోటి : రేవంత్‌కు ఝలక్‌లు

  రేవంత్‌కు ఆదిలోనే షాక్, అనుమతికి నో: ధైర్యవంతుడు, కేసీఆర్-బాబు కలవడం వల్లే: లక్ష్మీపార్వతి

  రేవంత్ రెడ్డితో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం మొదటి నుంచి సాగుతోంది. ఇందుకు సంబంధించి దాదాపు అందరి పేర్లు బయటకు వచ్చాయి.

  ఉండలేను.. వెళ్తావా: భుజంపై బాబు చేయి, రేవంత్ కంటతడి, ఏపీ సీఎంవోలో ఎమోషనల్

  పేర్లు బయటకు వచ్చిన వారే కాకుండా మరికొంతమంది నేతలు రేవంత్ రెడ్డితో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటికే రాజీనామా చేశారు. మరికొందరు ఇవాళ, రేపు చేస్తున్నారు.

   జాబితా ఇచ్చిన రేవంత్ రెడ్డి

  జాబితా ఇచ్చిన రేవంత్ రెడ్డి

  తనతో చేరేవారి జాబితాను రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలకు పంపించారని తెలుస్తోంది. వారిలో సండ్ర వెంకట వీరయ్య, ఇనుగాల పెద్దిరెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి, ధనసరి సీతక్క, విజయరమణా రావు తదితరుల పేర్లు ఉన్నాయని సమాచారం.

   మేం వెళ్లడం లేదంటూ కొందరు షాక్

  మేం వెళ్లడం లేదంటూ కొందరు షాక్

  అయితే, తాము రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం లేదని పై నేతలు చెబుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డితో ఎవరెవరు వెళ్తారనే అంశం ఉత్కంఠగా మారింది.

  జాబితా పంపించండి

  జాబితా పంపించండి

  ఇప్పటికే రేవంత్ రెడ్డి పంపిన జాబితాలో పలువురు తాము కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని చెబుతున్నందున కచ్చితమైన జాబితా ఇవ్వాలని రేవంత్‌కు కాంగ్రెస్ నేతలు సూచించారని తెలుస్తోంది. వాటిని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి పంపించాలని చెబుతున్నారని తెలుస్తోంది.

   ఇరవై మందిలో కొందరు యూటర్న్

  ఇరవై మందిలో కొందరు యూటర్న్

  రేవంత్ రెడ్డి వెంట చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది. అయితే ఆయన ఇచ్చిన జాబితాలో 20 మంది కీలక నేతల పేర్లు ప్రధానంగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే అందులో కొందరు యూటర్న్ తీసుకోవడంతో ఆ సంఖ్య 12 వరకు ఉంటుందని తెలుస్తోంది.

   కొత్తవాళ్లతో సర్దుకు పోవాలి

  కొత్తవాళ్లతో సర్దుకు పోవాలి

  టీడీపీ నుంచి చాలామంది నేతలు వస్తున్నందున కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే తమ పార్టీకి చెందిన తెలంగాణలోని ఆయన జిల్లాల నేతలను సంప్రదిస్తున్నారు. కొత్తగా వచ్చే వారితో సర్దుకు పోవాలని సూచనలు చేస్తున్నారని తెలుస్తోంది.

   వారు టీఆర్ఎస్ వైపు మొగ్గు

  వారు టీఆర్ఎస్ వైపు మొగ్గు

  మరో ఆసక్తికర విషయం ఏమంటే కొందరు తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి వెంట వెళ్లడం కంటే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడం మంచిదని భావిస్తున్నారని తెలుస్తోంది. జిల్లాల్లో ఆధిపత్య పోరు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల పోరు.. ఇలా పలు కారణాలతో రేవంత్ కంటే టీఆర్ఎస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని సమాచారం. కంచర్ల భూపాల్ రెడ్డి వంటి నేతలకు రేవంత్ అంటే అభిమానం ఉన్నప్పటికీ స్థానిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని సమాచారం. కానీ ఆయన కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Many of the leaders who were supposed to join the Congress along with former TD working president A. Revanth Reddy appear to have dropped out. They were to join the Congress in the presence of AICC vice-president Rahul Gandhi on October 31 in Delhi.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి