Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇదీ పూర్తి జాబితా: రేవంత్ వెంట వెళ్లేది వీళ్లే!, రావుల 'ఖతర్నాక్' కౌంటర్..

Recommended Video

    రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళ్లేది వీళ్లే! : Full List | Oneindia Telugu

    హైదరాబాద్: అనుకున్నట్టే రేవంత్ టీటీడీపీ ఊడ్చేసే పనిలో పడ్డారు. తాను పార్టీ వీడిందే గాక తనతో పాటు కీలక నేతలందరినీ వెంట పెట్టుకునిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఈ మధ్యాహ్నాం 1.30గం. సమయంలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు.

    సాయంత్రం 4గం. సమయంలో రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ చేరిక ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా తనతో పాటు టీడీపీని వీడుతున్నవారి జాబితాను రేవంత్ రాహుల్ కు అందించే అవకాశం ఉంది. ఇప్పటిదాకా 25మంది టీడీపీ కీలక నేతలు పార్టీని వీడుతున్నట్టు ఊహాగానాలు వినిపించగా.. ప్రస్తుతం మరికొన్ని పేర్లు అందులో చేరాయి.

     సింగిల్‌ ఎంట్రీతో కష్టమనే?:

    సింగిల్‌ ఎంట్రీతో కష్టమనే?:

    సింగిల్‌గా ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తనకంతగా ప్రాధాన్యం దక్కదనే విషయాన్ని రేవంత్ గుర్తించారు. కాబట్టే టీడీపీ నుంచి వీలైనంత మందిని తన వెంట లాక్కెళ్లాలని భావించారు. అనుకున్నట్టుగానే ఆ పనిలోను విజయవంతం అవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఏడుగురు జిల్లా స్థాయి అధ్యక్షులతో రాజీనామా చేయించారు. మరో ఆరు జిల్లాల అధ్యక్షులు కూడా నేడో రేపో రాజీనామా చేస్తారని తెలుస్తోంది. కేవలం టీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు అందినవారు మాత్రమే ప్రస్తుతం పార్టీలో కొనసాగడానికి మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

     ఇదీ జాబితా:

    ఇదీ జాబితా:

    ఒకప్పుడు టీడీపీ తరుపున మెరికల్లా పనిచేసి.. ఇప్పుడు మాజీలుగా మిగిలిపోయినవారందరికీ రేవంత్ గాలం వేశారు. వాళ్లతో రాజీనామా చేయించి తన వెంట తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. టీడీపీకి రాజీనామా చేసిన పార్టీల జిల్లా అధ్యక్షుల్లో సుభాష్‌రెడ్డి (కామారెడ్డి), బోడ జనార్దన్‌ (మంచిర్యాల), తోటకూర జంగయ్య యాదవ్‌ (మేడ్చల్‌), కేతావత్‌ బిల్యా నాయక్‌ (నల్లగొండ), పటేల్‌ రమేష్ రెడ్డి (సూర్యాపేట), సీహెచ్‌ విజయ రమణరావు (పెద్దపల్లి), సోయం బాపూరావు (ఆదిలాబాద్‌)లు ఉన్నారు.

     వీళ్లు కూడా:

    వీళ్లు కూడా:

    వరంగల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్యలు ఇప్పటికే రేవంత్ వెంట నడవాలని నిర్ణయించుకోగా, నిజామాబాద్ జిల్లా నుంచి రాజారాం యాదవ్‌, ఖలీంపతి, నీలకంఠరావు పాటిల్‌, నారాయణ, జనార్దన్‌ రెడ్డి, పరవయ్య, ధనంజయ, ఏనుగు మోహన్‌ రెడ్డి, రేఖ, విజయలక్ష్మి, ఖమ్మం జిల్లా నుంచి కంభంపాటి చంద్రశేఖర్‌రావు, ప్రసాద్‌, బానోతు హరిప్రియ, బానోతు హరిసింగ్‌ నాయక్‌, దేవేందర్‌ నాయక్‌, ప్లెంట్‌ రోజ్‌, నల్గొండ జిల్లా నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు రేవంత్ వెంట నడవనున్నట్టు తెలుస్తోంది.

     రావుల ఖతర్నాక్ కౌంటర్

    రావుల ఖతర్నాక్ కౌంటర్

    టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకోవడంతో.. ఆ పార్టీలో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరికొంతమంది నేతలకు గాలం వేసేందుకు వారు సిద్దమైపోతున్నారు. తాజాగా సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

    అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డికి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కకు మధ్య కాసేపు సంభాషణ కొనసాగింది. ఈ క్రమంలోను రావులను ఉద్దేశించి 'వస్తావా?' అంటూ భట్టి ప్రశ్నించారు. దానికి బదులుగా.. పనుందంటూ రావుల అక్కడి నుంచి జంప్ అయ్యారు. భట్టి 'వస్తావా' అని అడగడం పార్టీలోకే అని ప్రత్యేకంగా చెప్పేదేముంది.

    అనంతరం మీడియాతో మాట్లాడిన రావుల.. తన రాజకీయ జీవితమంతా టీడీపీలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఉన్న ఓ చెట్టును చూపిస్తూ, ఆ చెట్టు వయసెంతో తనకు తెలియదని, ఎంతో మంది అసెంబ్లీకి వచ్చి వెళుతున్నా, ఆ చెట్టు అలాగే ఉంటుందని, తను కూడా ఆ చెట్టులాంటి వాడినేనని చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+