వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా సరిహద్దులో మావోయిస్ట్ ఎన్ కౌంటర్: దంతెవాడలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

|
Google Oneindia TeluguNews

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతంలో దంతెవాడలో మరోసారి మావోయిస్టులపై పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా గొండెరాస్ అడవుల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు.

గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పీడీ యాక్ట్ నమోదు చేస్తున్న తెలంగాణా పోలీసులుగంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పీడీ యాక్ట్ నమోదు చేస్తున్న తెలంగాణా పోలీసులు

ఎన్ కౌంటర్ లో హతమైన మావోయిస్టులను దర్భా డివిజన్‌కు చెందిన మల్లంగెర్ ఏరియా కమిటీ సభ్యుడు హిద్మే కొహ్రామె మరియు మల్లంగేర్ ఏరియా కమిటీకి చెందిన నిలవాయలోని చేతనా నాట్య మండలికి చెందిన సాంస్కృతిక బృందం అధినేత పోజ్జేగా గుర్తించారు. పక్కా సమాచారం మేరకు దంతెవాడ జిల్లా రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ) సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఆపరేషన్ సమయంలో,మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీనికి ప్రతీకారంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు.

Maoist encounter on Telangana border: Two women Maoists killed in Dantewada

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన కొహ్రామె పై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది . అలాగే పోజ్జె పై ఒక లక్ష రివార్డు ఉన్నట్లుగా సమాచారం. ఘటనా స్థలం నుంచి స్థానికంగా తయారు చేసిన మూడు రైఫిళ్లు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు మరియు రోజువారీ ఉపయోగించే వస్తువులను కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో మరికొందరు గాయపడినట్లు సమాచారం. గాయపడినవారి కోసం దంతేవాడ జిల్లా రిజర్వు గార్డ్స్ గాలింపు చేపట్టారు. తప్పించుకున్న వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లుగా సమాచారం.

ఇటీవలికాలంలో మావోయిస్టు పార్టీ నేతలు అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో భద్రతా బలగాలు ఎక్కడెక్కడ మావోయిస్టులను పెడుతున్నాయి. అంతేకాదు ఇటీవలికాలంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న మావోయిస్టులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టిసారించి మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో తనిఖీలు చేస్తోంది. నవంబర్ 14వ తేదీన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యార పట్టి అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టుల కదలికలపై కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు పెద్ద ఎత్తున నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.

English summary
Two women Maoists were killed in an encounter by security forces in Gonderas forest of Chhattisgarh’s Dantewada district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X