వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ రెడ్డి గుడ్ బై.. మరోమారు పార్టీ వైఫల్యాలపై సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కు పంపించారు. చాలా బాధతో పార్టీని వీడుతానని మర్రి శశిధర్ రెడ్డి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో బంధాన్ని తెంచుకుంటున్నట్టు ఆయన తన లేఖలో వివరించారు.

తెలంగాణాలో కాంగ్రెస్ విఫలమైంది: మర్రి శశిధర్ రెడ్డి

తెలంగాణాలో కాంగ్రెస్ విఫలమైంది: మర్రి శశిధర్ రెడ్డి


అనంతరం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని పేర్కొన్న ఆయన తాను చెప్పదలుచుకున్న విషయాలను పూర్తి వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాశానని తెలిపారు. కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఉందని పేర్కొన్న ఆయన, తెలంగాణ బాగు కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అన్ని ఎన్నికల్లోనూ ఓటమి.. నేటి పరిస్థితి ఊహించలేదు

అన్ని ఎన్నికల్లోనూ ఓటమి.. నేటి పరిస్థితి ఊహించలేదు


రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నేటి పరిస్థితిని ఊహించలేదని పేర్కొన్న ఆయన పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మణిక్కం ఠాగూర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మణిక్కం ఠాగూర్ పుట్టక ముందు నుండి తాను రాజకీయాలు చూస్తున్నానని పేర్కొన్న మర్రి శశిధర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని అసహనం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు.. త్వరలోనే బీజేపీలోకి

టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు.. త్వరలోనే బీజేపీలోకి

టిఆర్ఎస్ పార్టీ ని ఎదుర్కొనే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని వెల్లడించారు. మైనారిటీల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని పేర్కొన్న మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ మాత్రమే మైనారిటీల అభివృద్ధికి పాటు పడుతోంది అని, అది తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఈనెల 25వ తేదీ లేదా 26 వ తేదీలలో ఢిల్లీ వెళ్లి బిజెపిలో చేరుతున్నట్లు మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చెయ్యటం కాంగ్రెస్ పార్టీకి షాక్ అనే చెప్పాలి.

మర్రి శశిధర్ రెడ్డి రాజీనామాకు ముందు పరిణామాలు

మర్రి శశిధర్ రెడ్డి రాజీనామాకు ముందు పరిణామాలు


అంతకు ముందు మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత పరిణామాలలో ఆయన కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను పార్టీ అధిష్టానం ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఈ క్రమంలోనే మర్రి శశిధర్ రెడ్డి సోమవారం నియోజకవర్గ ముఖ్య నాయకులతో బేగంపేటలోని తన కార్యాలయంలో సమావేశమై తాను బిజెపి చేరాలని నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వారికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయిందని, సరైన నిర్ణయాలు తీసుకునే నాయకులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిని పట్టించుకోకపోవడం వల్ల తాను బయటకు వెళ్లాల్సి వస్తుందని మర్రి శశిధర్ రెడ్డి పార్టీ శ్రేణులకు తెలిపారు. ఇక నేడు రాజీనామా ప్రకటించారు.

కేసీఆర్ సర్వే రిపోర్టుతో ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు టెన్షన్.. ఇప్పటినుండే పరేషాన్!!కేసీఆర్ సర్వే రిపోర్టుతో ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు టెన్షన్.. ఇప్పటినుండే పరేషాన్!!

English summary
Marri Shashidhar Reddy said goodbye to the Congress party and send his resignation to sonia gandhi and mallikarun kharge. Marri sashidhar reddy made Again sensational commentson the failures of the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X