రెండేళ్ల కుమార్తెతో కలిసి వివాహిత ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్య..!
క్షణికావేశంలో కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు వారి కుటుంబానికి తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత తన రెండేళ్ల చిన్నారితో కలిసి ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే..?
చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కీర్తిక అగర్వాల్ (28) పాతబస్తీలో నివాసముంటూ వ్యాపారం చేస్తున్న పృథ్విలాల్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు రెండేళ్ల కుమార్తె బియ్యారా ఉంది. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా వ్యక్తిగత విభేదాలు, కలహాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ కారణంగా ఏడాదిన్నర కిందట కీర్తిక కుమార్తెతో కలిసి బహదూర్‌పురలోని తన తల్లిదండ్రుల వద్ద నివాసముంటూ వస్తోంది.

దీంతో ఈనెల 2న కీర్తిక తన కుమార్తె బియ్యారాతో కలిసి హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపంలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లేక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మొదట గుర్తింపులు లభ్యం కాకపోవడంతో మార్చురీకి తరలించారు.
మరోవైపు తమ కుమార్తె, మనుమరాలు కనిపించడం లేదని కీర్తిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపి, మృతదేహం కీర్తిక అగర్వాల్‌దేనని నిర్ధారించారు. మొదట కీర్తిక మృతదేహం లభ్యమవ్వగా.. తర్వాతి రోజు హుస్సేన్‌సాగర్‌లో తేలియాడుతున్న చిన్నారి బియ్యారా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తల్లి, కుమార్తె మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, కీర్తిక కుటుంబసభ్యుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications