maruthi rao suicide:మారుతీరావు ఆత్మహత్యకు కారణమిదే..? స్నేహితులు ఏం చెప్పారంటే..?
మారుతీరావు ఆత్మహత్యకు ఆస్తి వివాదాలు, లావాదేవీలు కారణం కాదని అతని స్నేహితులు, సోదరుడు శ్రవణ్ చెప్తున్నారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి చార్జిషీట్ అని చెప్తున్నారు. హత్య జరిగిన 10 నెలలు ఊరికే ఉన్న పోలీసులు.. ఇప్పుడు ప్రెషర్ చేశారని తెలిపారు. చార్జిషీట్ ఫైల్ చేసే సమయంలో తమకు సమయం ఇవ్వాలని కోరగా.. మేజిస్ట్రెట్ కూడా రెండురోజుల గడువు ఇస్తున్నారని గుర్తుచేశారు. దీంతో న్యాయవాదితో మాట్లాడలేక, ఏం చేయాలో తోచక ఒత్తిడికి గురయ్యారని వెల్లడించారు.
Recommended Video

రెండు, మూడురోజుల సమయం..
ఫిబ్రవరి 27వ తేదీన పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేస్తామని తెలిపారని శ్రవణ్ చెప్పారు. తమకు సమయం ఇస్తే అడ్వకేట్‌ను నియమించుకుంటున్నామని కోర్టును కోరగా.. 29వ తేదీకి వాయిదావేశారని గుర్తుచేశారు. తర్వాత మార్చి 3వ తేదీకి ఇచ్చారని.. ఇలా రెండు, మూడురోజుల సమయం ఇస్తున్నారని పేర్కొన్నారు. అడ్వకేట్‌తో మాట్లాడే సమయం లేక, కేసును ఎలా ఎదుర్కొవాలో తెలియక మారుతీరావు బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పేర్కొన్నారు.

కారణమిదే..
ఆస్తి వివాదాలు కారణం కాదని, ఒత్తిడి తట్టుకోలేక చనిపోయారని పేర్కొన్నారు. కోర్టు కేసు వల్ల మానసికంగా కృంగిపోయాడని చెప్పారు. సూసైడ్ నోట్‌లో కూడా రెండు వ్యాఖ్యలు ఉన్నాయి. గిరిజ మిస్ యూ.. అమృత తల్లి వద్దకెళ్లు అని మాత్రమే ఉంది. మారుతీరావు.. పురుగుల మందును తనకు తెలిసిన ఫర్టిలైజర్ షాపు నుంచి కొనుగోలు చేశాడని పోలీసులు గుర్తించారు.

అమృత వల్లే..
ప్రణయ్‌ను హత్య చేశాడనే పశ్చాతాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. అదేం కాదని అమృత వల్లే తమ పేరు చెడిపోయిందని శ్రవణ్ పేర్కొన్నారు. కూతురికి నచ్చజెప్పలేక.. ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రణయ్ విషయంలో మారుతీరావు ఏం చేయలేదని.. అమృత తమ పరువు తీసిందని శ్రవణ్ తెలిపారు.

కారులోనే డ్రైవర్
నిన్న రాత్రి 7.30 గంటలకు ఆర్యవైశ్య భవన్‌కు మారుతీరావు వచ్చారు. డ్రైవర్‌ను కారులో నిద్రపోవాలని చెప్పి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 8 గంటలకు వెళ్లేసరికి విగతజీవిగా కనిపించాడు. డ్రైవర్ ఆర్య వైశ్య సిబ్బంది, మారుతీరావు సోదరుడు శ్రవణ్‌కు సమాచారం ఇచ్చారు.












Click it and Unblock the Notifications