వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారిషస్ ట్విస్ట్: జగన్ కేసులో మోడీకి లీగల్ నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Mauritius drags Modi to international court over Jagan's case

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు భారత్‌ను అంతర్జాతీయ కోర్టుకు లాగింది. ఇందు టెక్ జోన్ ఇన్వెస్ట్‌మెంట్ కేసులో న్యాయం చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరుతూ మారిషస్ ప్రభుత్వం భారత్‌ను లాగింది.

చదవండి: నరేంద్ర మోడీకి జగన్ 'అంతర్జాతీయ' షాక్: ఏమిటీ కేసు?

ఇందూ టెక్ జోన్ ఐటి సెజ్ కేసుతో తాము పెద్ద యెత్తున నష్టపోయామని చెబుతూ న్యాయం చేయాలని కోరుతూ మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని అర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది.

కేసులో ప్రధానికి నోటీసులు...

కేసులో ప్రధానికి నోటీసులు...

ప్రధాని నరేంద్ర మోడీతో సహా కొంత మంది మంత్రులకు నోటీసులు పంపించింది. ఇందూ టెక్ జోన్ ఐటి సెజ్ కేసులో జగన్, శ్యాంప్రసాద్ రెడ్డి సహా పలువురిపై సిబిఐ చార్జీషిట్ దాఖలు చేసింది. దాంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది.

మారిషస్ ఎందుకు అలా...

మారిషస్ ఎందుకు అలా...

ఇందూ టెక్ జోన్‌లో మారిషస్‌కు 49 శాతం వాటా ఉంది. ఐటి సెజ్ కోసం మారిషస్‌కు చెందిన రకీసా ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.115 కోట్లు పెట్టుబడి పెట్టింది. తొలి విడత రూ.1.18 కోట్లు, రెండో విడ రూ.14 కోట్లు, మూడో విడత రూ.99 కోట్లు పెట్టుబడిగా పెట్టింది.

సిబిఐ కేసు వల్ల అలా...

సిబిఐ కేసు వల్ల అలా...

సిబిఐ కేసుతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని, తమకు 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లు ఎక్కింది. మోడీకి నోటీసులు పంపించడమే కాకుండా కేంద్ర ఆర్థిక, వాణిజ్య, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది.

 తెలంగాణ ప్రభుత్వం ఇలా..

తెలంగాణ ప్రభుత్వం ఇలా..

మారిషస్ నోటీసులు పంపించిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ధృవీకరించింది. ిబిఐ, ఈడి కేసులు పెండింగులో ఉన్నందున తమ పెట్టుబడుల ఒప్పందానికి రక్షణ లేకుండా పోయిందని మారిషస్ ప్రభుత్వం నోటీసులు పంపించినట్లు తెలంగాణ ప్రభుత్వంలోని అధికార వర్గాలంటున్నాయి.

 ఆ ప్రాజెక్టు ఇలా..

ఆ ప్రాజెక్టు ఇలా..

ఇందూ టెక్ జోన్ ఐటి సెజ్‌ను శంషాబాద్ విమాశ్రయం సమీపంలో ప్లాన్ చేశారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత అది తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వచ్చింది.

English summary
The Mauritius government has dragged India to the International Court of Justice for arbitration in the InduTech Zone Investments case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X