కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాసలోకి..? కేసీఆర్ భేష్: చంద్రబాబుపై నటి కవిత అసంతృప్తి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: తెలుగుదేశం పార్టీ మహిళా నేత, ప్రముఖ నటి కవిత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆదివారం నాడు ఆమె కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసలు కురిపించారు. చిన్న సినిమాలను థియేటర్లలో 5వ షోగా ప్రదర్శించాలని సీఎం జీవో జారీ చేయడం అభినందనీయమని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ తరఫున ఉప ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలలో తాను చురుగ్గా పాల్గొని, ప్రచారం చేశానని, అయినప్పటికీ తనకు గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాసలో చేరుతున్నారా అని ప్రశ్నించగా ఆమె పైవిధంగా మాట్లాడారు.

May Actress Kavitha join TRS

తెలుగు రాష్ట్రాలో థియేటర్లు అందుబాటులో లేక దాదాపు రెండు వందల నుంచి 250 సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఉన్నాయని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. రెండు రాష్ట్రాలలోని థియేటర్లు కొద్దిమంది చేతుల్లో ఉన్నాయన్నారు.

ఫలితంగా చిన్న సినిమాలు విడుదలకు నోచుకోకుండా పోతున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారన్నారు. చిన్న సినిమాల కోసం రాష్ట్రంలో 200 నుంచి 250 మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణానికి సింగపూర్ కంపెనీతో ఒప్పందం జరిగిందన్నారు.

English summary
Actress and Telugudesam Party leader Kavitha may join TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X