ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతూ ఎంబీయే విద్యార్థిని ఆత్మహత్య

Recommended Video

    ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య వెనుక ఇన్ని కోణాలా ?

    హైదరాబాద్: కొంపల్లిలో ఎంబీయే సెకండియర్ చదువుతున్న విద్యార్థిని హనీషా చౌదరి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఈ చర్యకు పాల్పడింది. హనీషాది అనంతపురం జిల్లా. బుగ్గయ్య చౌదరి కూతురుగా గుర్తించారు.

    చదవండి: ఉప్పల్ నరబలి కేసులో విస్తుగొలిపే నిజాలు: రాజశేఖర్ ఆటకట్టించిన 'సూపర్' టెక్నాలజీ

    కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో ఎంబీయే చదువుతోంది. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్న హనీషా.. అంతకుముందు ప్రియుడు దక్షిత్ పటేల్‌తో వీడియో కాల్‌లో మాట్లాడింది. వీడియో కాల్‌లో అతను చూస్తుండగానే ఉరేసుకుంది.

    MBA girl student commits suicide in Hyderabad

    దీంతో అతను వెంటనే హాస్టల్ గదికి వచ్చాడు. లోపల గడియపెట్టి ఉండటంతో తలుపులు బద్దలు కొట్టాడు. హనీషాను ఆమె స్నేహితురాలి సాయంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఆలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని గాంధీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

    అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ విషయం గుర్తించామని, స్కైప్ ద్వారా బాయ్ ఫ్రెండుతో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆమె డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+