మేడారం జాతర: సాధారణ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆసక్తికర విజ్ఞప్తి!!
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మల జాతర కొనసాగుతుంది. మేడారం జాతరకు ఇప్పటికే లక్షలాదిగా భక్తజనం పోటెత్తారు. జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ అన్ని జిల్లాల నుంచి అదనపు బస్సులను ఏర్పాటు చేసి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుంది. ఇక ఈ క్రమంలో తాజాగా మేడారం జాతరకు వెళ్లే భక్తులను ఉద్దేశించి tsrtc ఎండి సజ్జనార్ ఒక విజ్ఞప్తి చేశారు.
Recommended Video

మేడారం మహా జాతరకు tsrtc నుండి 6000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు tsrtc ఎండి వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే మేడారం జాతరకు బస్సులు వెళ్లినట్లు ఆయన తెలిపారు. మేడారం జాతర నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో 51 క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి బస్సులు నడుపుతున్నట్టు ఆర్టిసి ఎండి సజ్జనార్ తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ యాజమాన్యం మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తుందని పేర్కొన్నారు.
మేడారం జాతరకు వెళ్లే భక్తులను గమ్య స్థానాలకు చేర్చడానికి పెద్ద మొత్తంలో బస్సులను మేడారం జాతరకు తరలించిన నేపథ్యంలో, రెగ్యులర్ సర్వీసులను తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో సాధారణ ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.
➡️6 వేల ప్రత్యేక బస్సులు
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024
➡️ మేడారంలో 55 ఎకరాల్లో సువిశాలమైన బేస్ క్యాంప్
➡️ భక్తుల కోసం 7 కిలోమీటర్ల పొడువున 50 క్యూలైన్లు
➡️రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు
➡️30 ఎకరాల విస్తీర్ణంలో 5 చోట్ల బస్సుల పార్కింగ్
➡️తాడ్వాయిలో ఎమర్జెన్సీ టికెట్ ఇష్యూయింగ్… pic.twitter.com/LMwJHVWvLj
మేడారం జాతర పూర్తయ్యే వరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలంతా సహకరించాలని tsrtc ఎండి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. సజ్జనార్ విజ్ఞప్తి నేపధ్యంలో ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునేవారు అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకోండి.












Click it and Unblock the Notifications