Weather Update: ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐదు రోజుల పాటు కూల్ వెదర్..!

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సోమ, మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈ వర్షాలు మరో నాలుగు రోజులు పాటు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో వారం పాటు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు విదర్భ, మహారాష్ట్ర, తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది.

దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అటు ఏపీలోని రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నాలుగు రోజులు ఆకాశం మేఘావృతమై.. వాతావరణం చల్లగా ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం కురుసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Meteorological Department has said that rains are likely to occur in Telangana in the next four days

వచ్చే 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం రంగారెడ్డి, భువనగిరి, మల్కాజిగిరి, జనగాం, నల్గొండ, సూర్యాపేట సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షం పడింది.

వర్షాలతో పలు జిల్లాల్లో రైతులు నష్టపోయారు. ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది.అయితే తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రోజు అంటే మే 13న కూడా వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+