హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు బిగ్ అప్డేట్..!!
హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది. మెట్రో విస్తరణ లో వేగంగా అడుగులు పడుతున్నాయి. రెండో దశ విస్తరణలో భూగర్భ మెట్రోకు నిర్ణయించింది. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డతో మెట్రో అధికారులు చర్చించారు. రెండో దశలో 6 కారిడార్లతో 116.4 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు సిద్దం చేసారు. ప్రస్తుతం 5 కారిడార్లకు డీపీఆర్ సిద్ధం అయింది. దీంతో, పాతబస్తీని కలుపుతూ మెట్రో అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్దం అవుతోంది.
మెట్రో రెండో దశ పైన స్పష్టత వచ్చింది. ఆరు కారిడార్లతో 116.4 కి.మీ మేర ప్రణాళికలు సిద్దం అయ్యాయి. అయిదు కారిడార్ల లో నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రాయదుర్గ్-కోకాపేట్, ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్-హయత్‌నగర్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు అవకాశం ఉన్న చోట డబుల్ డెక్కర్ నిర్మించాలని ప్రతిపాదన చేసారు. ఎయిర్‌పోర్టు సమీపంలో 1.06 కి.మీ. మేర అండర్ గ్రౌండ్ మార్గం నిర్మించనున్నారు. తొలుత నాగోలు నుంచి ఏయిర్ పోర్టు వరకు 24 స్టేషన్ల నిర్మాణం ప్రతిపాదనలు చేయగా.. ఇప్పుడు నాలుగు స్టేషన్లు తగ్గించి 20 నిర్మించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

రెండో దశ మెట్రో కోసం పాతబస్తీలో 1100 ఆస్తులు సేకరించాలని గుర్తించారు. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు ప్రతీ కిలో మీటరుకు రూ 318 కోట్ల ఖర్చు అవుతుందని తేల్చారు. ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తే, దేశంలోనే హైదరాబాద్ మెట్రో నెట్ వర్క్ అవతరిస్తుందని మెట్రో అధికారులు వెల్లడించారు.
కాగా, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు మెట్రో రెండో దశ పనులు జనవరి తొలి వారం నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు ఒక పూర్తి కారిడార్ ఉంటుందని అధికార వర్గాల సమాచారం. తొలి దశలో రోజుకు 5 నుంచి 7 లక్షల మంది ప్రయాణిస్తారని రెండవ దశలో రోజుకు 10 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications