రాయదుర్గం వరకు మెట్రో... మూడు నిమిషాలకో రైలు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్తను అందించింది. మెట్రో ఇప్పటి వరకు అయిదు నిమిషాలకు ఒక మెట్రో రైలు నడుస్తోంది. అయితే ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు మెట్రో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కారిడార్ 3లో నాగోల్ నుండి హైటెక్ సిటివరకు ప్రస్తుతం రైళ్లు నడుపుతున్నారు.
దీపావళీ నుండి రాయదుర్గం వరకు ఈ సర్వీసులను కొనసాగించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. కాగా డిశంబర్‌లో కారిడార్ -2లోని జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాన్ని ప్రారంభిస్తామని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే...

మూడు కారిడార్లలో రైళ్ల రాకపోకలు ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య ప్రారంభమైన తర్వాత 5 లక్షల నుండి 10 లక్షలకు చేరుకొంటుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో ప్రారంభంలో 15 నిమిషాలకో రైలును నడిపిన మెట్రో ప్రస్తతం అయిదు నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీతో మూడు నిమిషాలకు ఒక రైలును నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు..భవిష్యత్‌తో 90 సెకన్లకు ఒక రైలును నడిపె సామర్ధ్యం మెట్రోకు ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మూడు కారిడార్ల కోసం 56 రైళ్లు ఉండగా, 45 రైళ్లు మెట్రో కారిడార్-1, 3లలో 800 ట్రిప్పులు నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications