మెట్రో రైళ్ళు తయారవుతాయ్.. అక్కడ త్వరలోనే విమానాలు ఎగురుతాయ్.. కేంద్రమంత్రుల తీపికబురు!
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పైన కేంద్రం ప్రధానంగా ఫోకస్ చేస్తుందని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా వరంగల్ అభివృద్ధి పైన కేంద్రం ఫోకస్ చేస్తుందని వెల్లడించారు. వరంగల్ ప్రజల చిరకాల కల అయిన కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ నేడు సందర్శించిన మంత్రులు కాజీపేటలోని రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనుల పురోగతిని పరిశీలించారు.
500 కోట్ల రూపాయల పెట్టుబడులతో రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ
ఈ సందర్భంగా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అద్భుతమైన వరాలను గురించి మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ ఒక అద్బుతమని, 500 కోట్ల రూపాయల పెట్టుబడులతో నిర్మిస్తున్న మెగా ఫ్యాక్టరీ అన్నారు.

ఎన్నో ఏళ్ల కల నిజం చేసిన ప్రధాని మోదీ
దేశ ఆర్దిక పురోగతికి ఈ ఫ్యాక్టరీ దోహదం చేస్తుందని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. రైల్వే వ్యాగన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం వరంగల్ అదృష్టమన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ల కల అని ఆ కలను ప్రధాని మోదీ సాకారం చేశారన్నారు. డిసెంబర్ వరకు సివిల్ కన్స్ట్రక్షన్ పనులు పూర్తవుతాయని, 2026లో మాన్యుఫాక్చరింగ్ మొదలవుతుందని తెలిపారు.
దేశంలోనే మెగా మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్
ఇక్కడ ఇంజన్లు, బోగీలు, మెట్రో ట్రైన్స్ తయారీ జరుగుతుందని, కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ యూనిట్ అతి పెద్ద మాన్యుఫాక్చరింగ్ యూనిట్ అవుతుందని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 3000 మందికి ప్రత్యక్షంగా, వేల సంఖ్యలో స్థానికులకు పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అన్నారు.
వరంగల్ అభివృద్ధికి కేంద్రం సపోర్ట్
వరంగల్లో కేంద్రం చేసిన అభివృద్ధిని వివరించారు. వరంగల్ రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, వేయి స్తంభాల గుడి అభివృద్ధి ఇలా చాలా చేశామని చెప్పారు. వరంగల్లో త్వరలోనే విమానాలు ఎగరబోతున్నాయని, మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. వరంగల్ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కానీ ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications