వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telangana: హైదరాబాద్‍లో మరో మూడు డేటా సెంటర్లు.. రూ.16 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న మైక్రోసాఫ్ట్..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోకి అంతర్జాతీయ సంస్థల పెట్టుబుడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా దిగ్గజ ఐటీ కంపెన మైక్రోసాఫ్ట్‌ తెలంగాణలో మరో రూ.16,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్‌లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. దావోస్‌లో జరుగుతున్న 'వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం' సమావేశాల్లో ఈ ప్రకటన చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ చేరుకున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపారు.

6 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు

6 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు

ఈ క్రమంలోనే తెలంగాణలో రూ.16,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మైక్రోసాఫ్ట్.. తాజాగా మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. దీంతో హైదరాబాద్ లో 6 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. కాగా ఒక్కో డాటా సెంటర్‌ సామర్థ్యం 100 మెగావాట్లు కాగా, దశలవారీగా మైక్రోసాఫ్ట్‌ వీటి కార్యకలాపాలను మొదలు పెట్టనుంది.

అహ్మద్‌ మజారీ

అహ్మద్‌ మజారీ

గురువారం కేటీఆర్‌ మైక్రోసాఫ్ట్‌ ఆసియా హెడ్‌ అహ్మద్‌ మజారీతో భేటీ అయాయరు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ తన పెట్టుబడి విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. హైదరాబాద్‌తో మైక్రోసాఫ్ట్‌ అనుబంధం అద్భుతంగా కొనసాగుతున్నదని అహ్మద్‌ మజారీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలు ఉన్న నగరాల్లో హైదరాబాద్ కీలకమన్నారు. మరిన్ని ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఉన్న అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు.

కేటీఆర్


ఇండియాలో డేటా సేవల విస్తరణ కోసం మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా దశలవారీగా వచ్చే 15 ఏండ్లలో హైదరాబాద్‌లోని చందన్‌వెల్లి, ఎల్లికట్ట, కొత్తూరులో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడిచింది. తాజాగా మరో మూడు డాటా సెంటర్ల ఏర్పాటునకు ముందుకు రావడంతో తెలంగాణలో ఎప్లాయిమెంట్ పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వంతో అనేక రంగాల్లో మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యం కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు.

English summary
The flow of investments from international organizations into Telangana continues. Recently, the giant IT company Microsoft will invest another Rs.16,000 crore in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X