Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దుండగుల దాడి.. రాళ్ళు రువ్వి ఆపై..!!

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు రాళ్లు రువ్వి కిటికీల అద్దాలు పగలగొట్టారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. న్యూఢిల్లీలోని అశోకా రోడ్ ప్రాంతంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు రాళ్లు రువ్వి కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఢిల్లీ లోని ఆయన నివాసం పై ఈ తరహా దాడి చెయ్యటం ఇది నాలుగోసారి.

తన నివాసంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తాను రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లకముందే ఈ దాడి జరిగినట్టుగా పేర్కొన్న ఆయన, దాడి ఘటనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఈ దాడి జరిగినట్టుగా పేర్కొన్న ఆయన, 2014 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఈ విధమైన దాడి ఘటనలు జరగడం నాలుగవసారి అంటూ వెల్లడించారు.

MIM leader Asaduddin Owaisis house attacked by unknown people, pelted stones!!

ఘటన జరిగిన సమయంలో తాను జైపూర్ లో ఉన్నానని, దాడి గురించి తన ఇంట్లో పనిచేసే పనిమనిషి తనకు తెలియజేసినట్టు అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ఇక ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆయన కోరారు. హై సెక్యూరిటీ జోన్ గా పిలవబడే ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగిన ఆందోళనకరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చెయ్యటంతో అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు మేరకు అదనపు డిసిపి అసదుద్దీన్ ఓవైసీ నివాసాన్ని సందర్శించి దాడి జరిగిన తీరును పరిశీలించారు.

ఢిల్లీ పోలీస్ అధికారులు ఆయన నివాసం నుండి అవసరమైన అన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న అసదుద్దీన్ ఓవైసీ రాజస్థాన్ లో పార్టీ పట్టు కోసం, ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లటం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రెండు రోజుల పాటు ఓవైసీ రాజస్థాన్ లో పర్యటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+