చరిత్ర సృష్టించిన సింగరేణి సంస్థ
సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాదాపు 136 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి, రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు.
సింగరేణి కోసం ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ వల్లే తొలిసారి దేశంలోని ఇతర రాష్ట్రంలోనూ బొగ్గు గనిని ప్రారంభించడం సాధ్యమైందని, ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని సీఎం అన్నారు. ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని నైనీ గని ప్రారంభించడం ద్వారా సింగరేణి కొత్త శకానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి రేవంత్ ఒక సందేశంలో పేర్కొన్నారు.

నైనీ బొగ్గు గనులకు అన్ని అనుమతులు సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించిన చారిత్రక ఘట్టం సాకారం కావడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు.
తెలంగాణకు మణిమకుటంగా, వేలాది కార్మిక కుటుంబాలకు జీవనాధానంగా నిలుస్తున్న సింగరేణి సంస్థ అభివృద్ధికి, విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ సింగరేణి సంస్థకు అభినందనలు తెలియజేశారు.
ఒడిశాలో సింగరేణి బొగ్గు గని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
ఒడిశా రాష్ట్రంలో నైనీ గనిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైనీ గని తొలిమెట్టు అని అన్నారు. ఒడిశాలో సింగరేణి విస్తరణ తెలంగాణకు గర్వకారణం అని వ్యాఖ్యానించారు. ఇది సింగరేణికి మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక ఆనందకర సందర్భమన్నారు.
సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైనీ బ్లాక్ ప్రారంభం తొలి మెట్టు అని వ్యాఖ్యానించారు. ప్రజా పాలనలోనే నైనీ బొగ్గు బ్లాక్ పై ప్రత్యేక చొరువ తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం రేవంత్ వెల్లడించారు. ప్రజా పాలనలో ఇతర రాస్ట్రాలకు సింగరేణి ని విస్తరిస్తామని తెలిపారు. బొగ్గు గని ఏర్పాటుకు సహకరించిన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించిన సింగరేణికి ఈ సందర్భంగా భట్టి అభినందనలు తెలియజేశారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications