మంత్రి దామోదర ఫేస్‌బుక్ హ్యాక్: ఆ పార్టీల పోస్టులతో కలకలం
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ((Damodara Rajanarsimha)) ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. సైబర్ కేటుగాళ్లు మంత్రి ఫేస్‌బుక్ పేజీలో వందల కొద్ది పలు రకాలు పోస్టులు పెడుతున్నారు. తన అకౌంట్ హ్యాక్ అయిందని ఫేస్‌బుక్ పేజీ నుంచి వచ్చే పోస్టులకు ఎవరూ స్పందించవద్దని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు మంత్రి నర్సింహులు సూచించారు.
కాగా, రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. సామాన్యులనే గాక, ఏకంగా మంత్రులను కూడా వదలిపెట్టడం లేదు. తాజాగా, రాష్ట్ర వైద్యారోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేయడం గమనార్హం.

ఆ మంత్రి ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు.. సదరు పేజీలో బీజేపీ, టీడీపీ, తమిళనాడుకు చెందిన పలు రాజకీయ పార్టీల ఫోటోలను వందల సంఖ్యలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని అందులో వచ్చే పోస్టులకు ఎవరూ స్పందించవద్దని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తన కార్యకర్తలకు మంత్రి దామోదర సూచించారు.
కాగా, హ్యాకింగ్ ఘటనపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్లు రాజకీయ, సినీ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తూ ప్రభుత్వాలు, పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి కేసులను సీరియస్ తీసుకుంటున్న సైబర్ క్రైం పోలీసులు వారి ఆటకట్టిస్తున్నారు.












Click it and Unblock the Notifications