బీజేపీది బొంద మీది ప్యాకేజ్ ... మంత్రి ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు

కరోనా లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. అయితే ఈ ప్యాకేజ్ అంకెల గారడీ అని తెలంగాణా సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీది బొంద మీది ప్యాకేజ్ అక్కరకు రాని ప్యాకేజ్ అంటూ నిప్పులు చెరిగారు .

ముస్లీంల‌ను శ‌త్రువులుగా చూడొద్దన్న మంత్రి ఎర్రబెల్లి

ముస్లీంల‌ను శ‌త్రువులుగా చూడొద్దన్న మంత్రి ఎర్రబెల్లి

మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్ద‌వంగ‌ర‌, జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌, దేవ‌రుప్పుల మండ‌ల కేంద్రాల్లో ముస్లీంల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులను పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు బీజేపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తబ్లీఘీ జమాత్ తోనే , ముస్లీంల‌ వ‌ల్లే క‌రోనా విస్తృతి అయింద‌న‌డం పూర్తిగా నిజం కాదని ఆయన వ్యాఖ్యానించారు . ముస్లీంల‌ను శ‌త్రువులుగా చూడొద్దని ఆయన హితవు పలికారు. ఒక‌రిద్దరు ఎవరో చేసిన త‌ప్పుని అంద‌రికీ రుద్దొద్దు అని ఆయన పేర్కొన్నారు.

 రాష్ట్రాన్ని కుద‌వ పెడితే అప్పులిస్తారట అంటూ బీజేపీ సర్కార్ పై ధ్వజం

రాష్ట్రాన్ని కుద‌వ పెడితే అప్పులిస్తారట అంటూ బీజేపీ సర్కార్ పై ధ్వజం

ఇప్పటికే మ‌రో ఒక‌టి రెండేళ్ళు మ‌నం క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిందని , టీకాలు వ‌చ్చినా స‌రే, ఈ ప‌రిస్థితిలో మార్పు ఉండ‌క‌పోవ‌చ్చని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారని పేర్కొన్నారు. కరోనా కట్టడికి స్వీయ జాగ్రత్తలే శరణ్యం అని ఆయన పేర్కొన్నారు . ఇక కరోనా కష్టకాలంలో బీజేపీ ఇచ్చింది బొంద మీది ప్యాకేజీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కుద‌వ పెడితే అప్పులిస్తారట అంటూ మండిపడ్డారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆదుకోవాల్సింది పోయి అక్క‌ర‌కు రాని ప్యాకేజీలు ప్ర‌క‌టించారని నిప్పులు చెరిగారు ఎర్రబెల్లి .

బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల‌కు దిక్కు లేదు .. రైతాంగం కోసం తెలంగాణా సీఎం కృషి గొప్పది ..

బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల‌కు దిక్కు లేదు .. రైతాంగం కోసం తెలంగాణా సీఎం కృషి గొప్పది ..

బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల‌కు దిక్కులేదని ఆయన వ్యాఖ్యానించారు . రైతుల పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర వ‌చ్చే ప‌రిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఇంత కరోనా కష్ట కాలంలో కూడా సీఎం కెసిఆర్ తెలంగాణ‌ను ఆద‌ర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ప్ర‌భుత్వం చెప్పిన విధంగా సాగు చేద్దామని పేర్కొన్నారు. షుగ‌ర్ ఫ్రీ తెలంగాణ సోనానే సాగు చేద్దామన్న ఎర్రబెల్లి డిమాండ్ ఉన్న పంట‌ల‌నే వేద్దామని , రైతుల జీవితాల‌ను బంగారుమ‌యం చేద్దామని పేర్కొన్నారు. ఇక కేంద్రం ఈ సమయంలో కూడా చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+