రైతు బిడ్డనేనంటూ.. పొలం దున్ని మంత్రి ఎర్రబెల్లి దయార్ రావు
వరంగల్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. పొలంలో దిగి దుక్కి దున్నారు. తాను రైతు బిడ్డనేనంటూ రైతులతో కలిసి పాటలు పాడుతూ నాట్లు వేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగ చేస్తే...ఆ వ్యవసాయాన్ని మంత్రులు కూడా పొలంలోకి దిగి బురద గొర్రు కొడుతున్నారు. మా నాయకుని ఆశయ సాధనలో అడుగులు వేస్తాం అనడమే కాదు..నేరుగా వ్యవసాయం చేస్తాం...రైతు రాజు అయితే... రాజు కూడా రైతు అనే దానిని రుజువు చేస్తున్నారు మంత్రి ఎర్రబెల్లి అంటూ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, మంత్రులు కూడా ఇష్టంగా వ్యవసాయం చేయడంతో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారింది. గతంలో నెర్రెలు పారిన పొలాలు...స్వరాష్ట్రంలో ఇప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళ లాడుతున్నాయి.. అన్నదాత కళ్లలో ఆనందం పండిస్తున్నాయి.

అపర భగీరధుడు కేసీఆర్ ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొంది, నీళ్లు పరవళ్ళు తొక్కుతుంటే... చెరువులు కుంటలు, నిండి ఉప్పొంగుతుంటే... మంత్రులు కూడా సొంత పొలాల్లో దిగి వ్యవసాయం చేస్తుంటే...ఊరు వాడ, చేను చెలక మళ్ళీ ప్రాణం పోసుకుని పరవశిస్తున్నాయి. నా తెలంగాణ కోటి ఎకరాల మగాణా అన్న నినాదం నిజం అయ్యిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications